Anupama: మాటలు కూడా రావడంలేదు కానీ నా నమ్మకమే నిజమైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupama Parameswaran Comments on Tillu Square Sucess: 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ నేడు(మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా భారీ అంచనాలతో ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే సినిమా థియేటర్లలో నవ్వులు పూయిస్తూ బ్లాక్ బస్టర్ తెచ్చుకుంది.. ఇక ఈ సినిమా సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ప్రెస్ మీట్ నిర్వహించిన టీం తమ తమ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ” టిల్లు స్క్వేర్ కి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుండటం ఆనందం కలిగిస్తోంది, విడుదలకు ముందే ఈ సినిమా అదిరిపోతుంది అని నాకు తెలుసు కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆ మాట వినాలని ఆగా. ఇప్పుడు చెబుతున్నా, ఈ సినిమా అదిరిపోయిందన్నారు. ఇక
Tillu Cube: టిల్లు గాడు మళ్లీ మళ్లీ వస్తాడట
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ “ఆనందంలో మాటలు కూడా రావడంలేదు, ఈ సినిమా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమా చేసే సమయంలో ప్రతి క్షణం ఎంజాయ్ చేశా, ఇప్పుడు సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. నా పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి, నేను మొదటిసారి ఇలాంటి పాత్ర పోషించాను. అయినప్పటికీ నేను పోషించిన లిల్లీ మీద పాత్ర నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమై, ఇప్పుడు నా పాత్రకు వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ మొదటి షోకే అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మేము ముందు నుంచి అనుకున్నట్టుగానే.. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది. సినిమాకి మంచి టాక్ వస్తోంది, మార్నింగ్ షోకి, మ్యాట్నీకి వసూళ్లలో గ్రోత్ కనిపిస్తుంది. ఉగాది, రంజాన్ పండగలు, వేసవి సెలవులు ఉండటంతో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందనేని నమ్ముతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ శంకర్, రవి ఆంథోనీ, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!