మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గురించి తెలిసిన వారు ఎవరైనా సరే అయన్ను చూసి స్పూర్తి పొందుతారు.ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో గా ఎదిగి తానేంటో నిరూపించుకున్నారు.రవితేజ ఒకప్పుడు సైడ్ రోల్స్ చేసి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేసి చిన్నగా హీరోగా మారి ఆ తర్వాత మాస్ మహరాజ్ గా ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నారు.వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. దసరా కి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ను హిందీ లో కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావులో కీలక పాత్ర చేసిన అనుపం ఖేర్ రవితేజని హిందీ ఆడియన్స్ కు పరిచయం చేశారు.
అనుపమ్ ఖేర్ రవితేజను ఈ విధంగా పరిచయం చేసారు.ఇతను రవితేజ ఈయన నటించిన కిక్, విక్రమార్కుడు సినిమాలే హిందీలో రీమేక్ అయ్యాయని చెప్పారు.అంతేకాదు ఈయన ఒకప్పుడు తనతో ఫోటో కావాలని అడిగాడు కానీ అప్పుడు నేను ఇవ్వలేదు కానీ ఇప్పుడు అతను హీరో గా నటించిన సినిమా లో తను నటించానని చెప్పారు అనుపం ఖేర్. రవితేజ ఎదుగుదల కు ఇదే నిదర్శనమని అనుపం ఖేర్ తెలిపారు..టైగర్ నాగేశ్వర రావు సినిమా విషయానికి వస్తే సినిమా స్టూవర్టుపురం దొంగ నాగేశ్వర రావు జీవిత కథా స్పూర్తి తో తెరకెక్కించారు. సినిమా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ని మెప్పించేలా ఉండగా సినిమా లో ఎమోషన్ కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందని సమాచారం.. వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది