Anupam Kher as IB Officer Raghavendra Rajput in Tiger Nageswara Rao: రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టువర్టుపురం అనే గ్రామంలో దొంగల కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరావు అనే వ్యక్తి టైగర్ నాగేశ్వరరావు గా ఎలా మారాడు? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఎంత వణికించాడు? అనే విషయాలను ఆధారంగా చేసుకుని టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సాధారణంగానే నిజ జీవిత ఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తాయి. దానికి తోడు ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తూ ఉండడంతో ఒక్కసారిగా అందరిలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఆ అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఈ సినిమాతో రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తుండగా ఇప్పుడు మరొక స్టార్ యాక్టర్ ఈ సినిమాలో భాగమైనట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
Fanism at Peaks: ఇదెక్కడి అరాచకం అయ్యా.. పునీత్, ఎన్టీఆర్ ఫాన్స్ ఏం చేశారో చూస్తే తట్టుకోలేరు?
ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి రాఘవేంద్ర రాజపుత్ పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ కేర్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భారద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో జిషుసేన్ గుప్తా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మది సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ విస్స డైలాగ్స్ అందిస్తున్నారు.. ఇక ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి రాఘవేంద్ర రాజ్ పుత్ పాత్రలో నటిస్తున్న అనుపమ్ కేర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో ఆయన గంభీరంగా కనిపిస్తున్నారు.. అక్టోబర్ 20వ తేదీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈ నెల 17వ తేదీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.