న్యాచురల్ స్టార్ నాని.. మరోసారి తనదైన కామెడితో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్యామ్ సింగరాయ్ వంటి సీరియస్ రోల్ తర్వాత.. ఈ సారి సుందరంగా పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయబోతున్నాడు నాని. అసలు ఈ సినిమా టైటిల్‌తోనే ఫన్ క్రియేట్ చేసిన నాని.. అంతే ఫన్‌గా ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్టేట్ ఇచ్చారు. మరి అంటే సుందరానికి.. ట్రైలర్ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారు..?
శ్యామ్ సింగరాయ్‌తో హిట్ అందుకున్న నాని.. దాన్ని కంటిన్యూ చేసేలా ‘అంటే సుందరానికీ’ అనే మూవీతో.. జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నజ్రియా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో.. ప్రమోషన్స్ స్పీడప్ చేసింది చిత్ర యూనిట్. నాని కూడా ప్రమోషన్స్ కోసం ‘దసరా’ చిత్రానికి కాస్తా బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో సినిమాపై ఆసక్తిని పెంచేందుకు వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్టేట్ ఇచ్చారు. మే 30న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ‘అంటే సుందరానికీ’ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. ఇక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఫుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. ఇందులో నాని సుందర ప్రసాద్ పాత్రను పోషిస్తుండగా.. నజ్రియా లీలా పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి నవీన్ యేర్నెని, వై రవి శంకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా నానికి ఎలాంటి హిట్‌ను అందిస్తుందో తెలియాలంటే.. జూన్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.