Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!

Anna Konidela

Anna Konidela

Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నెటిజన్లకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఆమె ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. చాలా కాలంగా ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నానని, కానీ సరైన విధంగా ఎలా చెప్పాలో తెలియక ఆలస్యం అయిందని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించినప్పటి నుంచే ఈ విషయం గురించి రాయాలని భావించానని, పలుమార్లు రాసి మళ్లీ తొలగించానని వెల్లడించారు.

“చాలా మందికి నేను మొదట అన్నా లెజినోవా పేరుతోనే పరిచయం అయ్యాను. మా వివాహ వార్తలు వచ్చినప్పుడు కూడా అదే పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. కానీ మా వివాహ ధ్రువీకరణ (మ్యారెజ్ సర్టిఫికెట్) పత్రంలో ఆ ఇంటిపేరు కనిపించే చివరి సందర్భం అదే. వివాహం జరిగిన రోజు నుంచి నా భర్త ఇంటిపేరు స్వీకరించి అన్నా కొణిదెలగా మారాను” అని ఆమె వెల్లడించారు. ఇకపై తనను “అన్నా కొణిదెల” అని పిలవాలని ఆమె అభిమానులను కోరారు. “ఇదే నా పేరు.. ఈ పేరుతోనే నేను నన్ను నేను అనుభూతి చెందుతాను. మీరు అర్థం చేసుకోవడం నాకు ఎంతో ముఖ్యమైనది” అంటూ భావోద్వేగంగా స్పందించారు. అలాగే తన పోస్ట్‌లో షేర్ చేసిన ఫొటో గురించి కూడా అన్నా కొణిదెల ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది తాను, పవన్ కళ్యాణ్ కలిసి చేసిన తొలి పర్యటనలో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తీసుకున్న ఫొటో అని వెల్లడించారు. ప్రస్తుతం అన్నా కొణిదెల చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆమెకు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె రిక్వెస్ట్‌ను గౌరవిస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా వివాహం 2013 సెప్టెంబర్ 30వ తేదీన హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరికి ఒక కుమార్తె (పోలెనా అంజనా పవనోవా), ఒక కుమారుడు (మార్క్ శంకర్ పవనోవిచ్) సంతానం.