కోలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం కూలీ. రజనీకాంత్ మేనియా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న కూలీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. అందులో భాగంగా కూలీ ఫస్ట్ సింగిల్ చికిటు సాంగ్ రిలీజ్ చేసింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రోమో ఫ్యాన్స్ లో భారీ ఎక్సపెక్టషన్స్ పెంచేలా చేసింది. కానీ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యాక కొంత నిరుత్సహా పరిచింది. తమిళ తంబీలు ఆశించిన స్థాయిలో సాంగ్ లేదన్నది టాక్. సాంగ్ లో రజనీ పెద్దగా కనిపించకుండా అనిరుధ్, కొరియోగ్రాఫర్ శాండీ కవర్ చేసేయడాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు.
మొత్తం సాంగ్ లో ఆడియెన్స్ కు ఊపు తెప్పించింది అంటే ఒకప్పటి డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ కంపోజర్ టి రాజేందర్ అనే చెప్పాలి. సాంగ్ పాడడంతో పాటు డ్యాన్స్ చేసే విధానం కూడా ఆకట్టుకుంది. రీసెంట్లీ ఆరోమలై మూవీలో ఓ సాంగ్ ఆలపించిన శింబు ఫాదర్ రీసెంట్లీ చికిటు వైబ్ సాంగ్‌తో మరోసారి అదరగొట్టేశారు. ఓ పదేళ్ల క్రితం టి రాజేందర్ సరదాగా చేసిన ట్యూన్‌ను అనిరుధ్ చికిటు కోసం తీసుకున్నాడు. ఈ సాంగ్ తో కూలీ బజ్ అమాంతం పెరుగుతుందని భావించింది కాని నెటిజన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. చికిటు పాటతో వైబ్ తెప్పించలేకపోయినప్పటికీ.. రాజేందర్ వాయిస్, డ్యాన్స్‌తో ఊపు రప్పించగలిగినప్పటికీ.. ఇంకా ఏదో మిస్సయ్యామంటున్నారు ఆడియన్స్. మరి మిగిలిన సాంగ్స్ తో అనిరుధ్ కూలికి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.