Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Animal Review By Ram Gopal Varma

Ram Gopal Varma: యానిమల్ రివ్యూ… వారిద్దరి బూట్లు నాకుతాను

Published Date :December 3, 2023 , 5:40 pm
By Roja Pantham
Ram Gopal Varma: యానిమల్ రివ్యూ… వారిద్దరి బూట్లు నాకుతాను
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ram Gopal Varma: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వర్మ.. ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో అందరికి తెల్సిందే. ఇక తనకు ఏదైనా సినిమా నచ్చింది అంటే.. దాని గురించి మాట్లాడంలో ఎలాంటి మొహమాటపడడు వర్మ. అయితే ఎప్పుడు ఒక ముక్కలో రివ్యూ చెప్పే వర్మ.. యానిమల్ సినిమాకు ఏకంగా నాలుగు పేజీలు రివ్యూ రాసుకొచ్చాడు. యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి.. సందీప్ రెడ్డిని వర్మతో పోల్చాడు. జనరేషన్ ను చేంజ్ చేసే సత్తా ఉన్న దర్శకుల్లో వర్మ తరువాత సందీప్ అంటూ చెప్పడంతో.. ప్రతి ఒక్కరు కూడా యానిమల్ సినిమా చూసి వర్మను రివ్యూ ఇవ్వమని అడగడంతో.. ఎట్టకేలకు ఈరోజు వర్మ.. యానిమల్ రివ్యూ చెప్పుకొచ్చాడు. తనదైన శైలిలో సినిమా గురించి మాట్లాడుతూనే.. ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలపై, డైరెక్టర్ లపై విరుచుకుపడ్డాడు.

“యానిమల్ “ సినిమా మీద రాసిన చాలా రివ్యూలు చూసి, చదివిన తర్వాతే నేను సినిమా కి వెళ్ళాను .. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా సినిమాలు తీసిన తర్వాత నేను కేవలం ఒక ప్రేక్షకుడి గా మాత్రమే ఏ సినిమానీ చూడలేను … అందుకే ఈ సినిమాని వేరు వేరు కోణాల్లోచూడాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళాను. నైన్ అండ్ హాఫ్ వీక్స్ , ఫ్యాటల్ అట్రాక్షన్, లోలిట , లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్ యాడ్రియన్ లిన్ ఒక ఇంటర్వ్యూ లో ఏమన్నాడంటే, సినిమా అన్నది ప్రేక్షకుడికి నచ్చిందా , నచ్చలేదా , అన్నంత సింపుల్ గా ఉండకూడదు. రియల్లీ ఇంపాక్ట్ఫుల్ సినిమా అనేది ప్రేక్షకులు తీవ్రంగా డిస్కస్ చేసుకుని ఆర్గ్వ్ చేసుకునేలా ఉండాలి. ఒక కొత్త తర్కానికి తెర తీయాలి అన్నాడు. అదే సందేశం ఇవ్వాళ సందీప్ వంగ, యానిమాల్ చిత్రంతో వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడు. బాక్సాఫీస్ రన్ ముగిసిన తర్వాత చాలా సంవత్సరాల వరకూ కూడా యానిమల్ సినిమా కి సంభందించిన వాదనలు, తర్కాలు కొనసాగుతాయి. అంతే కాకుండా, ఈ సినిమా హిపోక్రిసీ బట్టలిప్పదీసి పూర్తి నగ్నమైన నిజాయితీనీ విశ్వరూపం తో చూపించడం తో ఎంతో కొంత మన సంస్కృతిని కూడా మార్చిపారేస్తుంది అని నా ప్రఘాడ నమ్మకం. ఎందుకంటే యానిమల్ అనేది ఒక సినిమా కాదు .. అది ఒక సోషల్ స్టేట్మెంటు.

Also Read

  • Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
  • Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. 'పెద్ది' లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
  • Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
  • Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!

నాకు ఆ సినిమా కథ కానీ , తండ్రి కొడుకుల బంధం కానీ ఏమంత ఎక్కలేదు. కానీ బాగా ఎక్కిందేంటంటే అలాంటి పాత కథా వస్తువుల్ని బేస్ గా చేసుకుంటూ సందీప్ మునుపెన్నడూ చూడని సీన్లని అద్భుతంగా చూపించడం. సినిమా అంటే ఇలాగే వుండాలని అనుకునే డైరెక్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడు సందీప్.. వాళ్ళు నమ్మే చాదస్తపు నైతిక విలువులన్నింటినీ తన చీపురు కట్ట తో ఊడ్చి ఎత్తి చెత్త కుండీలో పడేసాడు. యానిమల్ సినిమా స్లో గా ఉన్నప్పటికీ చాలా సార్లు మనం షాక్ అవుతాము .. దానికి కారణం సినిమా స్లోగా ఉండటమే అని తర్వాత తెలుసుకుంటాము .. నా ఉద్దేశ్యం లో ఈ సినిమా మూడున్నర గంటలు కాకుండా నాలుగున్నర గంటలున్నా తక్కువే. హీరో వెళ్లి బేస్ బాల్ బ్యాటో అలాంటిదేదో పట్టుకుని వస్తాడేమో ,అని నాతో పాటు అందరూ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలొ మెషీన్ గన్ తో రావటం అన్నది థియేటర్ లొ మా అందరినీ కుర్చీలోనుంచి కింద పడేంత ఎఫెక్ట్ ఇచ్చింది. “హ్యాపీనెస్ ఈజ్ ఎ డెసిషన్” అని రన్బీర్ సింపుల్ గా చెప్పిన డైలాగ్ తత్వవేత్తలందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. “ఇక మీ మీద ఈగ వాలినా సరే వాళ్ళని తగలబెట్టేస్తాను” అనే మాట రన్బీర్ తన తండ్రికి చెప్తున్నప్పుడు సినిమాటోగ్రఫీ పరంగా, ఎడిటింగ్ శైలి పరంగా ఆ పాత్ర ను ఎలివెట్ చెయ్యటానికి తీసుకున్న ఎక్కువ టైం కేక్ మొత్తం తయారీ చూపించి ఐసింగ్ పెట్టినట్టనిపించింది.ఇక ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫైట్ లొ వాడిన అర్జున్ వెల్లి పాట , మైకేల్ జాక్సన్ “బీట్ ఇట్” మ్యూజిక్ వీడియోని గుర్తు చేసింది.ట్రెడిషనల్ సినిమా రూల్స్ ని కడుపు లొ గుద్దుతూ , తన కాళ్లతో తన్నినందుకు సందీప్ని జీర్ణించుకోలేక , కడుపు నొప్పి తో నేల మీద పడి దొర్లడం తప్ప విమర్శకులు ఇంకేం చెయ్యలేరు. ఇక్కడ “ఆర్ట్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈజ్ , ఆర్ట్ ఈజ్ అల్సో వాట్ ఇట్ కుడ్ బీ” అని ఐయాన్ రాండ్ చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి.

నిజాన్ని దుమ్ము దులిపేసి దాని అసలు రూపాన్ని ఏ మాత్రం కలరింగ్ లేకుండా నిజంగా చూపించిన ఒక నిజమైన కళాకారుడు సందీప్.దీనికి ఉదాహరణగా అక్కడక్కడా వచ్చే కామిక్ సన్నివేశాల్లో ఉదాహరణకి, బ్రా స్ట్రాప్ స్పాంకింగ్, సెక్స్ గురించి డాక్టర్ లతో మాట్లాడుతున్నప్పుడు లాంటివి చెప్పుకోవచ్చు.
ఇలాంటివి సినిమాకు అవసరం లేదేమో అనిపించినా కేవలం హీరో పాత్ర స్వభావాన్ని ప్రేక్షకుల మెదళ్ళల్లో కి మేకులు కొట్టి దించడమే ఇక్కడ డైరెక్టర్ లక్ష్యం. తన భర్త ని తమ్ముడు విజయే చంపాడు అని తెలిసిన తర్వాత విజయ్ ని తన అక్క కొట్టడం. తరువాత విజయ్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసే సీను ఫ్రాన్సిస్ కాప్పొల గాడ్ ఫాదర్ సీన్ కి బాబు లా వుంది. ఒక్క మాట లొ చెప్పాలంటే ఫ్రాన్సిస్ కాప్పొల సందీప్ దగ్గర అసిస్టెంట్ గా చేరాలి. ఇందులో విలన్ బాబీ ఇంట్రడక్షన్ సినిమా చరిత్రలోనే అంతముందెప్పుడూ లేనంత అత్యంత ఒరిజినల్ గా ఉంది .. ఎందుకంటే ఒక స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్ లో అతన్ని ఒక పెళ్లి కూతురి మేని ముసుగు తీసినట్టు ఆవిష్కరించడం జస్ట్ జీనియస్. తను పూర్తి ఆరోగ్యవంతుణ్ణయిపోయాను అని చెప్పటానికి హీరో తన ఫామిలీ ముందు , స్టాఫ్ ముందు నగ్నంగా నడిచే సీన్ నెవెర్ బిఫోర్ ఈవెన్ ఇన్ వరల్డ్ సినిమా. విజయ్ పాత్ర కి సంభందించి నాకు నచ్చని ఒకే ఒక సన్నివేశం, అమ్మాయిని విజయ్ తన బూట్లు నాకమని ఆర్డర్ ఇవ్వడం .. అది కూడా ఎందుకంటే ఆ నటిని ఎంచుకున్న తీరు, తనని చూస్తూనే నాకు కలిగిన సానుభూతి, తనని చూపించిన ప్రతి క్లోజ్ షాట్ లో అది పెరుగుతూ రావడమే.. కండోమ్ వాడావా ? అని హీరో ని రష్మిక అడిగే సీనూ ,అది రాసిన, తీసిన తీరు అద్భుతం. రష్మీక నటన కి నేను క్లీన్ బౌల్డ్ అనే చెప్పాలి.
ట్రైలర్స్ చూసినప్పటి నుంచి రన్బీర్ ఏమైనా కొంచెం ఓవర్ గా వెళుతున్నాడా అన్న ఫీలింగ్ నాకు లోలోపల ఉండింది. కానీ ఒక ఫిల్మ్ మేకర్ గా, ప్రేక్షకుడి గా, మొదటిసారి రన్బీర్ నటన సందీప్ రాసిన క్యారెక్టర్ ని మోస్తందా? లేదా సందీప్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ రన్బీర్ నటనని మోస్తాందా? అన్న కన్ఫ్యూషన్ లో పడేసింది నన్ను.. రన్బీర్ నటన లో వున్నా ఎక్సట్రాడినరీ కన్సిస్టెన్సీ 1913 లో వచ్చిన రాజా హరిశ్చంద్ర నుంచి ఇప్పుడు 2023 వరకూ , నూట పది సంవత్సరాలలో ఏ ఆక్టరూ చూపించలేకపోయాడు..ఆ అమ్మాయిని తన బూటు నాకమనే ఒక్క సన్నివేశం లో తప్ప రన్బీర్ లియోనార్డో డి కాప్రియో ని కూడా మించిపోయాడు.

హేయ్ సందీప్ రెడ్డి వంగ దయచేసి నీ కాళ్ళ ఫోటో నాకు వాట్సాప్ లో పంపిస్తే మొక్కుకుంటాను. దానికి కారణాలు

1.కెమెరా కనుక్కున్న మొదలు ఇప్పటివరకూ అందరూ నమ్ముతున్న సినీ సంప్రదాయాలన్నింటిని నీ ఎడమ కాలి బూటు తో తన్ని తన్ని రక్తాలు కక్కుకునేలా చేసావు.

2.ఇకనుంచి బాలీవుడ్ లో కానీ ,టాలీవుడ్ లో కానీ, ప్రతి సినిమా ఆఫీస్లోనూ నీ యానిమల్ సినిమా టాపిక్ ఒక దెయ్యంలా ఆవహించి వాళ్ళు ముందు ముందు తియ్యబోయే ప్రతి సినిమాని పీడిస్తుంది

నేను ముందే చెప్పినట్టు , ఆ అమ్మాయిని షూ నాకమని నువ్వు రన్బీర్ తో చెప్పించిన ఆ ఒక్క షాట్ నాకు నచ్చకపోయినా , అనిల్ లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్ కి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్ లో శక్తి కపూర్ ఒళ్ళో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రన్బీర్ షాట్ ఒక్కదాని కోసం, నేను మీ ఇద్దరి షూస్ నాకుతాను

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Animal Review
  • ram gopal varma
  • Ranbir Kapoor
  • Sandeep Reddy Vanga
  • Tollywood News

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions