Animal Movie Censor Review and Plot Details: రణబీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్ గా అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్, త్రిప్తి డిమ్రీ ఇతర కీలక పాత్రల్లో యానిమల్ సినిమా తెరకెక్కింది. ఇక డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ యానిమల్ మూవీ సెన్సార్ రిపోర్ట్, ప్లాట్ వివరాలు బయటకు వచ్చాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ యానిమల్ సినిమాలో ఒక యానిమల్ లాంటి పాత్రలో రణబీర్ కపూర్‌ను చూసేందుకు హిందీ సినీ ప్రేమికులు మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన CBFC(సెంట్రల్ సెన్సార్ బోర్డు) అధికారులు ‘A’ సర్టిఫికేట్‌తో సెన్సార్ చేశారు. ఇక ఈ సినిమా మొత్తం రన్‌టైమ్ 203.29 నిమిషాలు (3 గంటల 23 నిమిషాలుగా ఉంది). ఇక యానిమల్ మూవీ సెన్సార్ రిపోర్ట్ అలాగే ప్లాట్ సారాంశం ఇలా ఉన్నాయి.
Salman Khan: సల్లూ భాయ్ ఏ దేశమైనా పారిపో.. కానీ లేపేస్తాం?
ఈ సినిమా అంతా తండ్రి పట్ల కొడుకు ప్రేమ చుట్టూ తిరగనుందని అంటున్నారు. ఉద్యోగరీత్యా తరచూ దూరంగా ఉంటున్న తండ్రి తన కొడుకు ప్రేమ తీవ్రతను అర్థం చేసుకోలేడు, తన తండ్రి – కుటుంబం పట్ల ఈ అమితమైన ప్రేమ – అభిమానం తండ్రి _ కొడుకుల మధ్య సంఘర్షణను సృష్టిస్తుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తన తండ్రితో ఎంతగా అనుబంధం కలిగి ఉన్నాడు, కానీ అతను తన ప్రేమను వ్యక్తపరచలేడు. అనుకోని ప్రమాదం తన తండ్రిని చుట్టుముట్టినప్పుడు, అతన్ని రక్షించడానికి ఎంతకైనా తెగిస్తానని ప్రతిజ్ఞ చేసి రంగంలోకి దిగుతాడు. ఈ సినిమా స్లోగా ఉందని నిడివి కొంతవరకు ఇబ్బంది పెట్టి మైనస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి సినిమా అంతా ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. టి-సిరీస్ – సందీప్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ యానిమల్‌ని సంయుక్తంగా నిర్మించాయి.