Anil Ravipudi: ఆ రేర్ ఫీట్‌కు ఒక్క అడుగు దూరంలో అనిల్ రావిపూడి.. కింగ్‌తో క్రేజీ కాంబో ఫిక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi: టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జునతో ఆయన సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం.
ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే అనిల్ రావిపూడి కెరీర్లో ఒక అరుదైన రికార్డ్‌ను సృష్టించినట్లు అవుతుంది. ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌లతో అనిల్ రావిపూడి సినిమాలు తీసి హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆయన నాగార్జునతో కూడా సినిమా చేస్తే సీనియర్ టాప్-4 హీరోలందరినీ డైరెక్ట్ చేసిన రేర్ ఫీట్‌ను సొంతం చేసుకుంటారు. నాగార్జున మార్క్ వింటేజ్ కామెడీ టైమింగ్‌కు, అనిల్ రావిపూడి మార్క్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతరే అని ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్.. విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే, నాగార్జున 101వ చిత్రంగా ఈ కొత్త సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!