SSMB 29: రాజమౌళి ప్లేస్ లో రావిపూడి? మహేష్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన పన్నెండేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్ని రూమర్స్ బయటకి వచ్చినా, ఎంత డిలే అవుతున్నా గుంటూరు కారం సినిమా గురించి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అంచనాలు మాత్రం తగ్గట్లేదు. 2024 సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో సాలిడ్ రీజనల్ హిట్ కొట్టి తర్వాత రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేసే పనిలో ఉన్నాడు మహేష్ బాబు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో బయటకి వచ్చిన రాజమౌళ-మహేష్ బాబు కాంబినేషన్ ప్రాజెక్ట్ ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ అవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మహేష్-రాజమౌళి డిసెంబర్ నుంచి SSMB 29 వర్క్స్ ని స్టార్ట్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ కోసం ఘట్టమనేని అభిమానులు మాత్రమే కాదు మొత్తం ఇండియా ఎదురు చూస్తుంది. అంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతోంది.#SSMB29 ప్రాజెక్ట్ రాజమౌళి నుంచి అనీల్ రావిపూడి చేతికి వెళ్ళింది. రాజమౌళి SSMB 30 సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. రాజమౌళితో సినిమా స్టార్ట్ అవ్వడం కన్నా ముందు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో నిజమెంత ఉందనే విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం SSMB 29 ప్రాజెక్ట్ విషయంలో రచ్చ జరుగుతోంది. రాజమౌళి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి టైం పడితే అనీల్ రావిపూడి ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేస్తాడు కాబట్టి మహేష్ ఒక సినిమా ఓకే చేసి ఉంటాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో నిజమెంత అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
-
Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!”.
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!