ఒక సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. 24 క్రాప్ట్స్ నుబ్యాలెన్స్ చేస్తేనే మంచి అవుట్ ఫుట్ వస్తుంది. ఆ బాధ్యత అంతా డైరెక్టర్ పైనే ఉంటుంది.. అంతమందిని హ్యాండిల్ చేసేటప్పుడు ఎక్కడో ఒకచోట ఎవరితో ఒకరితో గొడవలు ఉండడం సహజం.. అవి ఎలాంటి విబేధాలు అయినా వాటిని సరిచేసుకోవడం డైరెక్టర్ పైనే ఉంటుంది. ఇక తాజాగా ‘ఎఫ్3’ సినిమాతో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి కూడా అదే విషయాన్నీ చెప్పుకొచ్చాడు.. గత కొన్ని రోజులుగా అనిల్ కు, హీరోయిన్ తమన్నాకు మధ్య గొడవలు జరుగుతున్నాయని, అందుకే ఆమె సినిమా ప్రమోషన్స్ కు కూడా రాలేదని వార్తలు గుప్పుమన్నాయి.
ఇక ఈ వార్తలపై ఎట్టకేలకు నోరు విప్పాడు అనిల్.. “అవును నాకు , తమన్నాకు గొడవ జరిగింది.. అయితే అదంత పెద్దదేమీ కాదు.. అంతమంది ఆర్టిస్టులను మేనేజ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి సహజమే.. ఒకరోజు రాత్రి షూటింగ్ ఇంకాస్త పొడిగించాల్సి వచ్చింది. దానికామె పొద్దున్నే జిమ్ చేసుకోవాలి, టైం లేదు, వెళ్లిపోవాలి అని మాట్లాడింది.. దీంతో నాకు కోపం వచ్చింది.. ఇద్దరి మధ్య ఆ హీట్ ఒక రెండు రోజులు నడుస్తూ వచ్చింది. ఆ తరువాత అంతా నార్మల్ అయిపోయి మాట్లాడుకున్నాం.. ఇక ఆమె పప్రమోషన్స్ కి రాకపోవడానికి కారణం ఈ గొడవ కాదు .. ఆమెకు వేరే షూటింగ్స్ ఉండడం వలన రాలేకపోయింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటించిన ఎఫ్ 3 ఇటీవల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే.. విడుదలైన 10 రోజులకే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం..