Jharkhand: ఏడాది మార్చి వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో నక్సలైట్లను తుదముట్టిస్తున్నారు. కొంద మంది లొంగిపోగా.. మరి కొందరు మాత్రం తుపాకులకు బలవుతున్నారు. తాజాగా భద్రతా దళాలు నిర్వహించిన భారీ సంయుక్త యాంటీ–నక్సల్ ఆపరేషన్‌లో సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు, అత్యంత వాంటెడ్ నక్సలైట్ పటీరామ్ మాఝీ అలియాస్ ‘అనల్ దా’ హతమయ్యాడు. ఝార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్ మేఘబురు’ పేరుతో గురువారం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో మొత్తం 17 మంది మావోయిస్టులు మృతి చెందారు.
READ MORE: IND vs NZ: ఇషాన్, సూర్య మెరుపు ఇన్నింగ్స్‌లు.. రెండో టీ20లో 209 రన్స్ ఉఫ్!
209 కోబ్రా బెటాలియన్, చైబాసా జిల్లా పోలీసులు, ఝార్ఖండ్ జాగ్వార్ బలగాలు కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. రెండు రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఎదురుకాల్పుల్లో రూ.1 కోటి బహుమతి ఉన్న అనల్ దాతో పాటు మరో 14 మంది మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోయారు. శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ సమయంలో మరో రెండు మృతదేహాలు లభించడంతో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరింది. అనల్ దా సీపీఐ (మావోయిస్టు)లో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ కమిటీ సభ్యుడు. ఝార్ఖండ్‌లో అతనిపై 149కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ను భద్రతా దళాలు కీలక విజయంగా భావిస్తున్నాయి. ఈ అంశంపై కిరిబురు ఎస్డీపీఓ అజయ్ కర్కెట్టా మాట్లాడుతూ.. “దాదాపు రెండు రోజుల పాటు కొనసాగిన ఎదురుకాల్పులు ఇప్పుడు ముగిశాయి. అయితే పగటి వేళల్లో సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తాం” అని తెలిపారు. ఇదిలా ఉండగా, శుక్రవారం కూడా సారండా అటవీ ప్రాంతంలో మరో నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ రెండో రోజుకు చేరుకున్న సమయంలో కొన్నిచోట్ల చెదురుమదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
READ MORE: Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో లోకేష్ బర్త్‌డే వేడుకలు.. అఖిలప్రియ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా!