Journalist Biopic: ‘షహీద్ షోయబుల్లాఖాన్’ టీజర్ రిలీజ్ చేసిన అనిల్ కూర్మాచలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Journalist Biopic: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చిన పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్. సామాన్య ప్రజల పక్షాన నిలిచి, రజాకార్ల దారుణ దమనకాండను ఖండించి, భారతదేశంలో నిజాం సంస్థానం విలీనానికి కృషి చేసిన వ్యక్తి. షోయబుల్లా ఖాన్ రచనలను సహించలేని రజాకర్లు అతి దారుణంగా ఆయన్ని హతమార్చారు. 1948 నాటి వాస్తవిక సంఘటన ఆధారంగా ఆ పాత్రికేయుని సాహసగాథను ‘షహీద్ షోయబుల్లా ఖాన్’ పేరుతో తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సమర్పణలో శీలం లింగారెడ్డి సినిమాగా తీస్తున్నారు. దీనికి వి.ఆర్.టి. దీపక్ రచన చేసి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా టీజర్ ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం ఆవిష్కరించారు. ఈ చిత్రానికి దీపక్ తో పాటు శ్రీనివాస్ రాజలింగం మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. చిన్నికృష్ణ సంగీతం అందించారు. దీపక్, మధుబాల, మిథున్ చక్రవర్తి, అలీ, నాజర్, మురళీధర్ గౌడ్, భరత్, రాజశేఖర్, బోస్, శోభన, కిషన్ రావు, కనకాల రమేశ్, నరసింహ, అజామ్, సి. దయానంద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ టీజర్ ఆవిష్కరణలో నట శిక్షకుడు, ఈ సినిమాలో రజాకార్ ఖాసిం రజ్వీ పాత్రధారి అడ్ల సతీశ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
https://www.youtube.com/watch?v=I6VGmziREak
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!