Ananya Nagalla: సినిమా.. రంగుల ప్రపంచం. ఇక్కడ ముందుకు నెగ్గుకు రావాలంటే.. అందం, అభినయం రెండు ఉండాలి. ఈ రెండు లేకపోతే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఈ మధ్య హీరోయిన్లు ఈ విషయాన్ని బాగా ఒంటబట్టించుకున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నేర్చుకుంటున్నారు. ఎంచక్కా బట్టలను తగ్గించి అందాలను ఆరబోసి అవకాశాలను అందుకుంటున్నారు. మొదటి నుంచి తెలుగమ్మాయిలు అందాల ప్రదర్శనకు దూరమని ఒక అభిప్రాయం ఉండేది. కానీ, ఆ అభిప్రాయాలా కంచెలను తెంచేస్తున్నారు తెలుగమ్మాయిలు. అందాలను ఆరబోయడంలో మేము మాత్రం ఎందుకు తగ్గాలి అంటూ సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు. ఇప్పటికే ఇషా రెబ్బ, శోభిత ధూళిపాళ్ల లాంటి తెలుగమ్మాయిలు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును రెచ్చగొడుతున్నారు. ఇక తాజాగా ఆ లిస్ట్ లోకి చేరిపోయింది మరో తెలుగందం అనన్య నాగళ్ల.
Raashi Khanna: హమ్మయ్య.. అమ్మడి లిప్ కిస్ ఇప్పటికి వర్క్ అవుట్ అయ్యింది
మల్లేశం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఒక హీరోయిన్ గా నటించి అందరి దృష్టిలో పడింది.వకీల్ సాబ్ అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ, అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది. దీంతో తన అవకాశాల కోసం తానే కష్టపడుతోంది. నేనేం అందాల ఆరబోతకు అతీతం కాదు.. నేను అన్ని పాత్రలు చేయగలను అంటూ ఇదుగో ఇలాంటి హాట్ హాట్ ఫోటోషూట్లతో డైరెక్టర్లకు హింట్ ఇస్తోంది. నిన్నటి వరకు ఒక మోస్తరు అందాల ప్రదర్శన చేసిన అనన్య.. నేడు మరింత తెగించేసింది. ఏకంగా బోల్డ్ ఫోటో షూట్ తో అభిమానుల మతి పోగెట్టేసింది.
Tarakaratna: తారకరత్న ఆరోగ్యం ఇప్పుడెలా ఉందంటే..?
నల్లని చీరలో జాకెట్ లేకుండా కేవలం పల్చటి బ్రాతో నడుము, ఎద అందాలను ఓరగా చూపిస్తూ పిచ్చెక్కించేసింది. అసలే అనన్య నడుము ఒంపులకు అభిమానులు ఫ్యాన్స్.. ఇక ఈ విధంగా రెండు చూపించేసరికి కుర్రకారు తట్టుకోవడం కష్టమే అని చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క అవకాశాల కోసం మరీ ఇంతగా తెగించాలా..? అనన్య.. ఇప్పటివరకు నువ్వు ఒక్కదానివే ఇలాంటి ఫోటోషూట్స్ చేయలేదని అనుకున్నాం.. ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టేశావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనన్య.. సమంత శాకుంతలం, బూట్ కట్ బాలరాజు సినిమాల్లో నటిస్తుంది. మరి ఈ సినిమాలు ఈ చిన్నదానికి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.