Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Epic Movie Release Date: స్టార్ హీరోల సినిమాల విడుదల వాయిదా పడితే, ఆ ఖాళీని ఇతర సినిమాలు వినియోగించుకోవడం కొత్త విషయం కాదు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలు చాలానే జరిగాయి. అయితే ఇప్పుడు అలాంటి ఆసక్తికర పరిణామమే దేవరకొండ సోదరుల సినిమాల విషయంలో కూడా జరుగుతుందనే ప్రచారం వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘రణబలి’ వాయిదా పడే అవకాశం ఉండటంతో అదే తేదీన ఆనంద్ దేవరకొండ నటించిన ‘ఎపిక్’ ప్రేక్షకుల ముందుకు రావచ్చనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎపిక్’ చిత్రంలో ఆనంద్ దేవరకొండకు జోడీగా వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘బేబీ’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ ప్రేమకథపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. మొదట మార్చిలో విడుదల చేయాలని భావించిన చిత్రబృందం, తర్వాత జూలై లక్ష్యంగా పెట్టుకున్నా అది కూడా సాధ్యపడలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాని ఇప్పుడు సెప్టెంబర్‌లో విడుదల చేసే దిశగా నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్ 11న విడుదల కావాల్సిన విజయ్ దేవరకొండ ‘రణబలి’ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఆ సినిమా అనుకున్న తేదీకి వచ్చే అవకాశాలు తగ్గాయని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. దీంతో ఖాళీ అయ్యే ఆ రిలీజ్ డేట్ ను ‘ఎపిక్’ కోసం వినియోగించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పుకు మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ‘లెనిన్’, ‘ఎపిక్’ రెండింటికీ ఒకే నిర్మాతలు ఉండటంతో, ముందుగా ‘లెనిన్’ విడుదలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఆగస్టు నెలలో ఇప్పటికే పలు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో, కొత్త విడుదల తేదీ కోసం సెప్టెంబర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ఇక ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటపై యూత్ లో మంచి ఆదరణ ఉంది. దర్శకుడు ఆదిత్య హాసన్ కూడా ఈ చిత్రాన్ని ఎమోషనల్ గా సాగే ప్రేమకథగా రూపొందించినట్లు తెలుస్తోంది. నిర్మాత నాగ వంశీ వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉండటం కూడా ఈ ప్రాజెక్ట్‌పై హైప్ పెంచుతోంది. సరైన ప్రచారం, అనుకున్న రిలీజ్ డేట్ దొరికితే ‘ఎపిక్’ మంచి విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి సెప్టెంబర్ 11 విడుదలపై వస్తున్న వార్తలను ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రచారంగా మాత్రమే పరిగణించాల్సి వస్తోంది. ఆఫీషియల్ అనౌన్స్ వచ్చాకే ‘ఎపిక్’ విడుదలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
- Tags
- cinema
- Epic Movie
తాజావార్తలు
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?