Amy Jackson: బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మద్రాసు పట్టణం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అమీ. మొదటిసినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా.. అమీకి మాత్రం వరుస ఆఫర్లను అందుకుంది. ఇక శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన ఐ సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హోదాను దక్కించుకుంది. ఈ సినిమా తరువాత.. తెలుగులో ఎవడు.. తమిళ్ లో తేరి వంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇక పెళ్ళికి ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చి మరింత ఫేమస్ అయ్యింది. బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే .. ప్రియుడితో బ్రేకప్ చెప్పి.. మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారు మతులు పోగొడుతుంది.
Trisha: ఆ నిర్మాతతో పెళ్లంటూ ప్రచారం.. త్రిష మాస్ వార్నింగ్
తాజాగా.. అమీ న్యూ లుక్ సెన్సేషన్ సృష్టిస్తోంది. అస్సలు అమ్మడు లుక్ చూస్తే మాత్రం ఫ్యాన్స్ దిమ్మతిరిగిపోవడం ఖాయమని చెప్పొచ్చు.. హెయిర్ మొత్తం కట్ చేయించి.. ఓపెన్‌హైమర్ సినిమాలో హీరో సిలియన్ మర్ఫీ లా మారిపోయింది. సడెన్ గా ఆమెను చూస్తే సిలియన్ మర్ఫీనే అనుకుంటారు. ఈ లుక్ చూసిన అభిమానులు అమీ .. ఏంటి ఇలా తయారయ్యింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ హీరో లుక్, అమీ లుక్ పక్కపక్కన పెట్టి జిరాక్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. అసలు అమీ ఇలా తయారవ్వడానికి కారణం ఏంటి.. ? ఏదైనా సినిమా కోసం చేస్తుందా.. ? లేక మరింకేదైనా కారణమా.. ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారింది.