వివాహ్ సినిమాతో వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ అమృతా రావ్. ఇక తెలుగులో అతిధి చిత్రంలో మహేష్ సరసన ముద్దుగా కనిపించి మెప్పించిన ఈ భామ.. ఈ చిత్రం తరువాత తెలుగుఫులో ఎక్కడా కనిపించలేదు. ఇక బాలీవుడ్ లో అమ్మడి లవ్ స్టోరీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె ఆర్జే అన్మోల్ తో ప్రేమలో పడింది. ప్రేమలో ఉన్నప్పుడే ఇద్దరు ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకొని సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించిన వీరు.. ఇటీవల మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈసారి పెద్దల సమక్షంలో.. అందరి అనుమతితో పెళ్లి పీటలు ఎక్కారు. ఈ విషయాన్ని ఈ జంట తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపారు.
‘కపుల్ ఆఫ్ థింగ్స్’ పేరుతో వీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసి అనేక విశేషాలు పంచుకుంటుంటారు. ఇటీవల వీరి సీక్రెట్ మ్యారేజ్ గురించి చెప్పుకొచ్చిన ఈ జంట ఇప్పుడు రెండోసారి పెళ్లి చేసుకొని ఆసచర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ప్రేమ జంటకు రెండేళ్ల బాబు ఉన్నాడు. ప్రతుతం అతడి ఆలనాపాలన చూసుకుంటున్న ఈ భామ త్వరలోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.