సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దానికి కారణం ఆయన ట్వీటే. ఆ ట్వీట్ ఏమిటంటే… “అప్పుడు మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి”… ఈ ట్వీట్ చూస్తే… ఇందులో అంతగా ఏముంది ? అసలు ఆయన దేనికి సంబంధించి ఈ ట్వీట్ చేశారు ? అనే డౌట్ రాక మానదు. బిగ్ బీ అమితాబ్ చేసిన ట్వీట్ వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీపై అంటున్నారు. అసలు అమితాబ్ ఈ ట్వీట్ కు ఏ సినిమా పేరునూ జత చేయకపోయినా, నెటిజన్లు మాత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ గురించే అమితాబ్ ట్వీట్ చేశారంటూ ఫిక్స్ అయిపోయారు. ఇంకేముందీ అసలు భయ దేనికి ? డైరెక్టుగా సినిమా పేరుతో ట్వీట్ చేయొచ్చుగా అంటూ ట్వీట్ చేస్తున్నారు.
Read Also : Prakash Raj : “ది కాశ్మీర్ ఫైల్స్” గాయాలను మాన్పుతోందా ? రేపుతోందా?
కాశ్మీరీ పండిట్ల విషాదాన్ని తెరపై చూసిన ప్రేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ‘ది కాశ్మీర్ ఫైల్స్’పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బచ్చన్ చేసిన ఇన్ డైరెక్ట్ ట్వీట్ మాత్రం నెటిజన్లకు అంతగా నచ్చలేదు. ఇంకేముంది అమితాబ్ ఇంత సాధించినప్పటికీ, ఆయన ఇంకా భయపడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
after achieving so much and still be so afraid that you can not even put the name of movie, not sure if he actually achieved anything in life.#KashmirFiles
— Pushp (@pushp_g) March 17, 2022
not to mention took his own time to put this message. https://t.co/V4UcKUmfrG
Sir @SrBachchan #TheKashmirFiles likhne main Dar Kyu rahe hai aap. https://t.co/tbUa8sI03O
— Ashish Kohli ॐ?? (@dograjournalist) March 17, 2022