బాలీవుడ్ షహెన్షా అమితాబ్ బచ్చన్ మాటలంటే ఎంత స్పెషల్‌గా ఉంటాయో అందరికీ తెలుసిందే. తాజాగా కేబీసీ షోలో బిగ్‌బీ చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఓ కంటెస్టెంట్‌ని ఉద్దేశించి ఆయన.. ‘‘చాలామంది మహిళలు ‘నేను గృహిణిని’ అని చిన్నగా అంటారు. కానీ ఇది చిన్న విషయం కాదు. గర్వంగా చెప్పండి! ఇంటి పనులు చూసుకోవడం, కుటుంబాన్ని కాపాడుకోవడం అంటే పెద్ద బాధ్యత’’ అని చెప్పడం అక్కడ ఉన్నవారినే కాదు, టీవీ ముందు చూసిన వాళ్లను కూడా ఇన్స్పైర్ చేసింది.
Also Read : The Paradise: ది ప్యారడైజ్ గురించి.. రాఘవ్ జుయల్ షాకింగ్ కామెంట్స్
ఇంకా ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ షేర్ చేశారు. ‘‘కోవిడ్ సమయంలో పురుషులు ఇంటి పనులు చేయాల్సి రావడం తో, గృహిణుల కష్టాలెంత కఠినమో అర్థమైంది’’ అన్నారు. బిగ్‌బీ చెప్పిన ఈ మాటలు వేదికపైనే చప్పట్ల వర్షం కురిపించాయి. నిజంగానే కదా.. మనం సాధారణంగా తీసుకునే ‘ఇంటి పనులు’ వెనుక అంత కష్టం, డెడికేషన్ ఉంటుందని ఆయన ఒక్క మాటలో చెప్పేశారు. అదే కాకుండా, ఇటీవల జరిగిన మహిళల క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌పై సాధించిన అద్భుత విజయాన్ని కూడా బిగ్‌బీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘‘భారతదేశానికి వీళ్లు అతిపెద్ద సంపద’’ అంటూ ట్వీట్ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు పాజిటివ్‌గా మాట్లాడే అమితాబ్ బచ్చన్ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.