Amithabachan : అమితాబ్ బచ్చన్ కు ఓ నెటిజన్ నుంచి షాకింగ్ కామెంట్ వచ్చింది. బిగ్ బీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటారు. కొందరి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తుంటారు. జీవితం, సక్సెస్, ఆరోగ్యం గురించే ఎక్కువగా సందేశాలు ఇస్తుంటారు ఆయన. తాజాగా ఆరోగ్యం గురించి ఓ సెషన్ నిర్వహించాడు. మీ గాడ్జెట్స్‌ను బ్రేక్ చేయండి.. మీకు దీర్ఘాయుస్సు ఉంటుందని అమితాబ్ పోస్ట్ పెట్టారు. దీనికి ఓ నెటిజన్ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. మీరు సరైన టైమ్ కు పడుకోకపోతే త్వరగా చనిపోతారు అన్నాడు.
Read Also : Kota Srinivas : కోట శ్రీనివాసరావుకు ఏమైంది.. ఇలా మారిపోయాడేంటి..
దానికి బిగ్ బీ స్పందిస్తూ.. నా మరణం గురించి మాట్లాడినందుకు థాంక్స్. అంతా ఈశ్వరుని దయ అంటూ ఘాటు రిప్లై ఇచ్చి పడేశారు. ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమితాబ్ వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కల్కి సినిమాలో కీలక పాత్ర చేసిన ఆయన.. ఇప్పుడు సీక్వెల్ కనిపించబోతున్నారు.