Kalyan Ram: ‘అమిగోస్’లో బాబాయ్ పాటని రీమిక్స్ చేసాం… టైటిల్ క్లాస్, సినిమా మాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో సూపర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ ని లైమ్ లైట్ లోకి తెచ్చిన ఈ మూవీ నందమూరి ఫాన్స్ లో ఆనందాన్ని పెంచింది. ఇదే జోష్ ని కంటిన్యు చేస్తూ కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై మాస్ ఆడియన్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ ని క్లియర్ చెయ్యడానికి మేకర్స్ ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. అమిగోస్ మూవీ క్లాస్ సినిమానా? లేక మాస్ సినిమానా? అనే అనుమానాన్ని క్లియర్ చేస్తూ… “పేరుకే ఇది క్లాస్ సినిమా, నందమూరి అభిమానులకి నచ్చే మాస్ ఎలిమెంట్స్ అన్ని అమిగోస్ లో ఉన్నాయి. ఇందులో ఒకేలా ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎలా కలిసారు? వాళ్లు స్నేహితులు ఎలా అయ్యారు? అసలు ఈ ముగ్గురి కథ ఏంటి?” అనే అంశాలు అమిగోస్ సినిమాలో స్పెషల్ గా ఉంటాయని ఈ ప్రమోషనల్ వీడియోలో కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చేశాడు. నందమూరి అభిమానులకి మరింత కిక్ ఇస్తూ… అమిగోస్ సినిమాలో బాలయ్య బాబాయ్ సూపర్ హిట్ పాటని రీమిక్స్ చేస్తున్నాం అని కూడా లీక్ ఇచ్చేశాడు.
ఆ సాంగ్ ఏంటో గెస్ చెయ్యమని అడిగాడు కానీ వీడియో ఎండింగ్ లో కళ్యాణ్ రామ్ పాటని హమ్ చేసిన సౌండ్ ని బట్టి, అది ‘ధర్మ క్షేత్రం’ సినిమాలోని పాట అని తెలుస్తుంది. బాలకృష్ణ, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించిన ధర్మక్షేత్రం సినిమాలో “ఎన్నో రాత్రులు వస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ” అనే సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూన్ కి తెలుగు సాహిత్య లెజెండ్స్ అయిన వేటూరి గారు, సిరి వెన్నెల సీతారామశాస్త్రి గారు కలిసి లిరిక్స్ రాశారు. బాలు, జానకి, మనో, చిత్ర లాంటి బ్యూటిఫుల్ సింగర్స్ కలిసి “ఎన్నో రాత్రులు వస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ” సాంగ్ ని స్పెషల్ గా మార్చారు. నైట్ ఎఫెక్ట్ లో కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని ఇప్పుడు కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నాడు. థియేటర్స్ లో ఈ సాంగ్ ప్లే అయితే ఆడియన్స్ కూడా హమ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇళయరాజా మ్యాజిక్ కి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఘిబ్రాన్ మ్యాచ్ చెయ్యగలడా అనేది ఆలోచించాల్సిన విషయమే.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమాలో కూడా బాలకృష్ణ హిట్ సాంగ్ అయిన ‘అరేయ్ ఓ సాంబ’ సాంగ్ ని రీమిక్స్ చేశాడు. ఈ పాటని థియేటర్స్ లో చూసిన నందమూరి ఫాన్స్ విజిల్స్ వేశారు. మరోసారి ఆ మ్యాజిక్ ని అమిగోస్ సినిమా రిపీట్ చేస్తుందేమో చూడాలి. రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న అమిగోస్ సినిమాలో అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అమిగోస్ మూవీని ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి తీసుకోని వస్తున్నారు.
#Amigos class cinema na? Mass Cinema na?
Who is a Doppelganger 🤔@NANDAMURIKALYAN explains it all to all his fans ❤🔥
&
Don't miss the ending 🤩🤩– https://t.co/8ewBOzQAWg@AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial @saregamasouth pic.twitter.com/2HMcerWbTV
— Mythri Movie Makers (@MythriOfficial) January 25, 2023
తాజావార్తలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!