Suhas: పెళ్ళి వేడుకకు సిద్ధమైన సుహాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Ambajipet Marriage Bandu’: ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు, దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. “భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్” లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. షార్ట్ ఫిల్మ్స్ తో కెరియర్ మొదలు పెట్టి, ‘కలర్ ఫోటో’తో సాలిడ్ హిట్ అందుకున్నాడు సుహాస్. కేవలం యూత్ కి నచ్చే కాన్సెప్ట్స్ బేస్డ్ సినిమాలు మాత్రమే కాకుండా, రీసెంట్ గా ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సినిమా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దగ్గరయ్యాడు.
ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మూవీ ఇప్పుడు షూటింగ్ పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాతో దుశ్యంత్ కటికనేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్ నటిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో మల్లికార్జున సెలూన్ షాప్ ను చూపిస్తూ, దాని ముందు ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మెంబర్స్ ను రివీల్ చేశారు. సుహాస్ తో పాటు గోపరాజు రమణ, ‘పుష్ప’ ఫేమ్ జగదీశ్ డప్పులు, సన్నాయితో పాటు ఇతర మంగళ వాయిద్యాలతో ఇందులో కనిపిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను త్వరలో అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
తాజావార్తలు
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!