Amala Paul: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమలా పాల్.. పేరు ఏంటో తెలుసా?
- తల్లి అయ్యిన సినీ హీరోయిన్ అమలా పాల్
- జూన్ 11న బాబు పుట్టినట్టు అమల భర్త జగత్ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
- ఇట్స్ ఎ బాయ్-మీట్ అవర్ లిటిల్ మిరాకిల్- ఇలై" అనే క్యాప్షన్‌తో వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amala Paul and Jagat Desai become parents to a baby boy: సినీ హీరోయిన్ అమలా పాల్ తల్లి అయ్యింది. అమల భర్త జగత్ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ద్వారా బాబు పుట్టిన విషయాన్ని ప్రకటించారు. ఆ పోస్ట్‌లో జగత్ జూన్ 11న బాబు పుట్టినట్టు చెప్పాడు. జగత్ అమలా పాల్ బాబుతో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టిన వీడియోను షేర్ చేశారు. “ఇట్స్ ఎ బాయ్!!, మీట్ అవర్ లిటిల్ మిరాకిల్, ఇలై” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేశారు. స్టార్స్‌తో సహా చాలా మంది విషెస్ చెబుతున్నారు. బాబు పుట్టి వారం రోజులు కావస్తున్నా అమల, జగత్ ఈ సంతోషకరమైన వార్తను సర్ ప్రైజ్ గా ఉంచారు. బిడ్డ, తల్లి ఇంటికి వచ్చిన క్షణంలో సిద్ధం చేసిన వీడియోను జగత్ ఇప్పుడు పంచుకున్నారు. బాబు పేరు కూడా బయటపెట్టాడు జగత్. బాబుకు ILAI అని పేరు పెట్టారు. బాబుతో ఇంటికి వచ్చిన అమలకు పెద్ద సర్ ప్రైజ్ సిద్ధమైంది. ప్రత్యేక నేపథ్య అలంకరణలను కూడా వీడియోలో చూడవచ్చు. గతేడాది నవంబర్‌లో అమల, జగత్ పెళ్లి చేసుకున్నారు. కొచ్చిలో జరిగిన వివాహ వేడుకకు దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు.
Beenz: శర్వానంద్ తమ్ముడి రెస్టారెంట్ రీ లాంచ్.. ఎక్కడో తెలుసా?
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
జనవరి 4న తాను తల్లి కాబోతున్నానన్న వార్తను అమల పంచుకున్నారు. సౌత్ ఇండియాలోని బోల్డ్ హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు. అమలా పాల్ మలయాళ సినిమా ద్వారా నటనా రంగంలోకి ప్రవేశించింది. అయితే ఆమె తమిళంలో అలాగే తెలుగులో చాలా సినిమాలు చేసింది. 2009లో లాల్ జోస్ దర్శకత్వం వహించిన ‘నీలతామర’ అమల మొదటి సినిమా. ఇందులో అమల చిన్న పాత్ర చేసింది. ఆ తర్వాత తమిళంలో రెండు సినిమాలు చేసినా విజయం సాధించలేదు. 2010లో విడుదలైన తమిళ చిత్రం ‘మైనా’ అమల కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి గాను అమల తమిళనాడు ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో అమల నటించింది. చివరిగా బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆడుజీవితం’తో థియేటర్లలోకి వచ్చింది అమలా పాల్. ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్రధారి నజీబ్ భార్య జైనుగా అమల నటించింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!