Amala Akkineni: అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ కూడా ప్లాప్ ల లిస్టులోకి చేరిపోయింది. రెండేళ్లు ఎంతో కష్టపడి చేసిన సినిమా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన ఏజెంట్ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకొని డిజాస్టర్ దిశగా కొనసాగుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత అఖిల్ ను అందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు చేయడం మానేసి కొత్త కథలను చేయమని సలహాలు ఇస్తున్నారు. అఖిల్ బాడ్ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర నుంచి సౌండ్ మిక్సింగ్ వరకు ఎక్కడ దొరికితే అక్కడ మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ ట్రోల్స్ పై అమల అక్కినేని స్పందించింది. కొడుకు కోసం ఏదైనా చేసే ఆమె.. ఇలాంటి సమయంలో కొడుకుకు అండగా నిలబడింది.
Wish: వాల్ట్ డిస్నీ వందేళ్ళ కానుక ‘విష్’!
“దైర్యంగా మాట్లాడలేనివారు ఇన్ సెక్యూరిటీ ఉన్నవారు మాత్రమే ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారని నేను భావిస్తాను. అలాంటి ట్రోల్స్ పట్టించుకోనవసరం లేదు. అఖిల్ కు కూడా అదే చెప్పాను. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా నేను చూసాను. చాలా బాగా చేశాడు. సినిమాలో కొన్ని లోపాలున్నాయి. నేను కాదు అనడం లేదు.. కానీ, సినిమా చూస్తున్నంత సేపు అలా నడిచిపోయింది. ఓపెన్ మైండ్ తో చూస్తే అవేమి మన కంటికి కనిపించవు. నేను థియేటర్ లో చూశాను.. అన్ని రకాల ప్రేక్షకులు ఉన్నారు. అమ్మలు, అమ్మమ్మలు, అమ్మాయిలు, కుర్రాళ్ళు.. ఎవరికి ఏ సీన్ నచ్చితే.. అప్పుడు వారు పెద్దగా అరుస్తున్నారు. ఇక అఖిల్ నెక్స్ట్ మూవీ మీ అందరిని మెప్పించాలని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.