మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలకు భీమవరం ముస్తాబవుతోంది. అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలను జూలై 4న భీమవరం లో నిర్వహించనున్న విషయం విదితమే. ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. ఆరోజు భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు.
ఇకపోతే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చిరంజీవికి ఆహ్వానం పంపారు. తప్పకుండా ఈ వేడుకకు హాజరై అల్లూరి జయంతి వేడుకల్లో పలు పంచుకోవాలని కోరారు. ఒక్కరోజే కాకుండా ఏడాది పాటు ఈ వేడుక వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగనున్నట్లు తెలిపారు. ఇక చిరు సైతం కిషన్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి వేడుకకు వస్తామని తెలిపినట్లు సమాచారం.