ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ కూడా సంపాదించుకున్నారు.పుష్ప సినిమాతో ఈయనకి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయిందని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే.
అల్లు అర్జున్ నటించిన ఏ పాత్రకు అయిన పూర్తి న్యాయం చేస్తారని తాజాగా పుష్ప 2 సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. స్టార్ హీరో ఇమేజ్ ఉన్న కూడా చేతులకు గాజులు తోడుక్కొని నుదుటిన బొట్టు పెట్టుకొని అమ్మవారి గెటప్ లో ఆయన నటించారు. ఇలా సినిమాల పట్ల ఎంతో డెడికేషన్ ఉన్నటువంటి అల్లు అర్జున్ ఒక సినిమా షూటింగ్ సమయంలో పూర్తిగా చికెన్ తినడమే మానేసారని అయితే తెలుస్తోంది. షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఈయన చికెన్ ను తన దగ్గరికి కూడా రానివ్వలేదని సమాచారం.ఇక ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ సందర్భంలో తెలిపారు.మరి అల్లు అర్జున్ చికెన్ మట్టకుండా నటించిన ఆ సినిమానే హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈయన చికెన్ తినడం మానేశారని కూడా హరీష్ తెలియజేశారు. ఇందులో అల్లు అర్జున్ ఒక బ్రాహ్మణుడి పాత్రలో నటించారు. బ్రాహ్మణులు చికెన్ తినరు కనుక వారికి ఆ గౌరవాన్ని ఇస్తూ ఈయన కూడా ఆ పాత్రలో నటిస్తున్నందుకు చికెన్ ముట్టుకోలేదంటూ గతంలో హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తేనే అల్లు అర్జున్ కు సినిమాలంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది.