AAA : హీరో నేనే.. విలన్ నేనే.. తగ్గేదెలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప సినిమాకు ముందు అల్లు అర్జున్.. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్. బన్నీ గురించి చెప్పుకోవాలంటే ఇలాగె చెప్పుకోవాలి. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసి ఐకాన్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది పుష్ప . దీంతో ఈ సారి చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసాడు అల్లు అర్జున్. ఆ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా చేస్తున్నాడు బన్నీ. కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది.
Also Read : Star Hero : ఓ వైపు ప్లాపులు.. అయినా సరే భారీ రెమ్యునరేషన్
Also Read
ఇటీవల ఈ సినిమాకు సంభందించిన పూజా కార్యక్రమాలు ముంబాయిలో జరిగాయి. కాగా ఈ సినిమా షూట్ మొత్తం ముంబాయిలోను అలాగే విదేశాల్లో ఉంటుందని సమాచారం. కాగా ఈ సినిమా గురించి మరోక ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూల్ రోల్ లో కనిపించబోతున్నాడట. హీరోతో పాటు విలన్ గా కూడా నటించబోతున్నాడట బన్నీ. ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ కనిపించని విధంగా విలన్ రోల్ ను డిజైన్ చేశాడట దర్శకుడు అట్లీ. ఈ సినిమా కోసం హాలీవుడ్ కు చెందిన ప్రముఖ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ గా అనన్య పాండే పేరు వినిపిస్తోంది. బన్నీ కెరీర్ లో 22, అట్లీ కెరీర్ లో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ కు సంగీత దర్శకుడిగా అనిరుద్ తో పాటు సాయి అబ్యాంకర్ పేరు కూడా పరిశీలనలో ఉంది.
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..