Allu Sirish: అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ హిట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. దాదాపు మూడేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శిరీష్.. ప్రస్తుతం ఉర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో శిరీష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాగురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నాడు.
ఇక ఒక ఇంటర్వ్యూలో తన ఒరిజినల్ బ్రేకప్స్ గురించి నోరు విప్పాడు. తనకు మూడు సార్లు బ్రేకప్ అయ్యిందని, దానివలన తాను ఎంతో కుంగిపోయినట్లు కూడా చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో మీ రిలేషన్స్ గురించి చెప్పండి అన్న ప్రశ్నకు శిరీష్ మాట్లాడుతూ ” ఈ కాలంలో రిలేషన్స్ లేకుండా ఎవరుంటారు.. నాకు రెండు మూడు రిలేషన్స్ ఉన్నాయి.. బ్రేకప్ కూడా అయ్యాయి. వాటి వలన నేను కూడా బాధపడ్డాను.. బ్రేకప్ చెప్తే ఎదుటి వాళ్లు భాద పడతారని అందుకుంటారు.. కానీ బ్రేకప్ చెప్పినవాళ్లు కూడా బాధపడతారు.. కానీ వెంటనే కాదు.. ఒక ఏడాది లో వారికి ఆ బాధ రెట్టింపు అవుతోంది. నేను పెద్దింటి అమ్మాయితో రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదు. నాకు ఒకొక్క సారి అనిపిస్తూ ఉంటుంది.. బ్రేకప్ చెప్పి అనవసరంగా టైమ్ వేస్ట్ చేస్తున్నానేమో అని.. అలా జరగకపోయి ఉంటే ఈ పాటికి నా పెళ్లి జరిగిపోయి ఉండేది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.