Allu Sirish: బన్నీ బ్రదర్.. మరో రీమేక్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Sirish: అల్లు కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కొడుకుగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా గౌరవం సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు అల్లు శిరీష్. మొదటి సినిమా రిలీజ్ కాకముందే బన్నీ తమ్ముడిగా మంచి పేరు తెచ్చుకున్నా.. సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది. అయినా శిరీష్ ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కొత్త జంట, ఒక్క క్షణం, ఏబీసీడీ, శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసీవో లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడే కానీ హిట్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. కొడుకును నిలబెట్టడానికి అల్లు అరవింద్, తమ్ముడు కోసం అల్లు అర్జున్ సైతం బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ విషయాన్నీ చెప్తూ శిరీష్ ఒక పోస్ట్ పెట్టాడు.
Sai Pallavi: సాయి పల్లవి నా క్రష్.. బాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
” నా తదుపరి చిత్రంలో నేను.. నా కో స్టార్. మా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రేపు అనగా మే 30 న సాయంత్రం 4 గంటలకు రివీల్ చేస్తాం.. సిద్ధంగా ఉండండి” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పోస్టర్ లో మెట్రో ట్రైన్ లో శిరీష్.. ఓకే టెడ్డీ నిలబడినట్లు కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ ను బట్టి.. శిరీష్ మరో రీమేక్ కు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య, అతని భార్య సయేషా జంటగా నటించిన చిత్రం టెడ్డీ. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2021 లో రిలీజ్ అయ్యింది కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక చూచాయిగా ఈ కథ గురించి చెప్పాలంటే.. ఒక ఇంట్రోవర్ట్ అయినా యువకుడుకు ఒక టెడ్డీ దొరుకుతుంది. అయితే అది మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతారు. ఆ టెడ్డీలో హీరోయిన్ ఆత్మ ఉండడం వలన అది మాట్లాడుతుందని అర్ధమవుతుంది. అసలు హీరోయిన్ కు ఏమైంది..? ఎందుకు టెడ్డీలో ఆత్మ వెళ్ళింది..? దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది కథ. ప్రస్తుతం శిరీష్ పోస్టర్ కూడా సేమ్ టెడ్డీ పోస్టర్ లానే ఉంది. మరి ఈ రెండు సినిమాలు ఒకటేనా..? లేక శిరీష్ ఏమైనా కొత్తగా చెప్తున్నాడా..? అనేది చూడాలి.
Me & my co-star from my next film! Will be sharing the first look & glimpse tomorrow, 30th May at 4:05pm. Stay tuned! ♥️ pic.twitter.com/GBXDTxpWpN
— Allu Sirish (@AlluSirish) May 29, 2023
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!