Site icon NTV Telugu

Allu Arjun : అల్లు అర్జున్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్

Allu Arjun

Allu Arjun

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే పుష్ప సినిమా మొదటి పార్టుకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. రెండో పార్టులో తన పాత్రకు గాను తెలంగాణ గద్దర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు మరో అవార్డు దక్కింది. ఇండియాలో అత్యుత్తమంగా భావించే దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ ముంబైలో జరిగింది. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటనకు గాను “వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్”గా బన్నీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నాడు.

Read Also : Bigg Boss 9 : వెధవ పొట్టేసుకుని ప్రేమ కావాలా.. భరణిపై మాధురి కామెంట్స్

ఈ విషయాన్ని తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపాడు. అవార్డు అందుకున్న మిగతా నటీనటులకు కంగ్రాట్స్ తెలిపాడు. తనకు సపోర్టు చేస్తున్న అభిమానులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాడు. ఈ అవార్డును తన ఫ్యాన్స్ కు అంకితం చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ పోస్టు చూసిన అభిమానులు బన్నీకి స్పెషల్ విషెస్ చెబుతున్నారు. పుష్ప సినిమాకు ఇప్పటికే చాలా ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

Read Also : Australia vs India 3rd T20I: టిమ్ డేవిడ్, స్టోయినిస్ దూకుడు.. టీమిండియా ముందు భారీ టార్గెట్..!

Exit mobile version