పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్, పుష్ప ది రూల్ సినిమాతో తన మార్కెట్ ని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైనప్ లో పెట్టి కెరీర్ పరంగా బిజీగా ఉన్న అల్లు అర్జున్, బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే మాట వినిపిస్తూనే ఉంది. హైదరాబాద్ అమీర్ పేటలోని సత్యం థియేటర్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. హాస్టల్స్ లో ఉండి చదువుకునే యూత్ అంతా శుక్రవారం ఉదయాన్నే ఏ కొత్త సినిమా వచ్చిందా అంటూ సత్యం థియేటర్ దగ్గరికి వెళ్లిపోతారు. ఇప్పుడే ఇదే ప్లేస్‌లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. మహేష్ బాబు AMB సినిమాస్ ఎంత స్పెషల్ గా ఉంటుందో, AAA కూడా అంతే స్పెషల్ గా ఉంటుందట.
AAA మల్టీప్లెక్స్ పేరుతో ఈ థియేటర్ ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉంది. లాంచింగ్‌కు రెడీగా ఉన్న ఈ మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ మల్టీప్లెక్స్‌ను జూన్ 16న రిలీజ్ కానున్న ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ సినిమాతో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తన క్లోజ్ ఫ్రెండ్ ప్రభాస్ హీరో, భారీ బడ్జట్, అంతకు మించి ఆకాశాన్ని తాకేలా ఉన్న అంచనాలు… ఇలాంటి సినిమాతో థియేటర్ ఓపెన్ అయితే శుభారంభం దొరికేసినట్లే. అందుకే బన్నీ AAA మల్టీప్లెక్స్‌ను ఆదిపురుష్ సినిమాతో లాంచ్ చేయడానికి ఓకే చెప్పాడు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.