Bheemla Nayak మార్చ్ 24 నుంచి ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో ఆల్రెడీ సినిమాను వీక్షించినప్పటికీ మరోమారు ఇంట్లో కూర్చుని Bheemla Nayak మేనియాను ఎంజాయ్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే ఈ పార్టీలో లేట్ గా జాయిన్ అయిన ‘పుష్ప’రాజ్ లేటెస్ట్ పోస్ట్ తో చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్, ఆహా రెండు ఓటిటి ప్లాట్ఫామ్ లలో అందుబాటులో ఉంది. ఇక ఆహాలో అయితే సరికొత్త 4కే ఫార్మాట్, డాల్బీ 5.1 ఆడియోలో అందుబాటులో ఉంది. దీంతో ఇంటి దగ్గరే ప్రేక్షకులు అద్భుతమైన సౌండ్ తో సినిమాను ఆస్వాదిస్తున్నారు.
Read Also : Swara Bhasker : హీరోయిన్ కు చేదు అనుభవం… క్యాబ్ డ్రైవర్ నిర్వాకం !
అయితే తాజాగా సినిమాను వీక్షించిన అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “పార్టీకి లేటుగా వచ్చాను. కానీ ఇలాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారు, రానా, త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ కే చంద్ర, తమన్, నాగవంశీలతో పాటు టీమ్ మొత్తానికి బిగ్ కంగ్రాచులేషన్స్. ఆహాలో హైయెస్ట్ క్వాలిటీ మూవీని ఎంజాయ్ చేయండి” అంటూ పోస్ట్ చేశారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలిచారు అన్నదే కథాంశం. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో కన్పించారు.
