పుష్ప ది రైజ్ సినిమా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఈ మూవీ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చి, పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చింది. 350 కోట్లు రాబట్టిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటిపోయింది. పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా పుష్ప ది రూల్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసి సెట్స్ పైకి కూడా తీసుకోని వెళ్లారు. సుకుమార్, అల్లు అర్జున్ లు పుష్ప ది రూల్ షూటింగ్ ని సైలెంట్ గా చేసేస్తున్నారు. ఇటివలే రష్మిక కూడా పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అంతాబాగానే ఉంది కానీ అల్లు అర్జున్ ఫాన్స్ కోసం ఒక్క అప్డేట్ ని కూడా ఇవ్వడకుండా ఊరిస్తున్నారు సుకుమార్ అండ్ టీం. అప్డేట్ ప్లీజ్ అంటూ అల్లు అర్జున్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎంత హంగామా చేసినా, గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసినా, అప్డేట్ కోసం ర్యాలీలు చేసినా సుకుమార్ మాత్రం సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నాడు.
అప్డేట్ అనగానే ‘తగ్గేదే లే’, ‘అస్సలు తగ్గేదే లే’ అని చెప్పి మాట దాటేస్తున్నారు పుష్ప టీం. అయితే ఈసారి మాత్రం పుష్ప ది రూల్ అప్డేట్ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఒక గ్లిమ్ప్స్ రాబోతుంది అంటూ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. “ఈ ప్రాజెక్ట్ గురించి మేము కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాం, అతి త్వరలో ఒక గ్లిమ్ప్స్ వీడియో వస్తుంది…” అంటూ రామకృష్ణ చెప్పాడు. రాబోయే అకేషన్స్ ని చూస్తే మార్చ్ 8న హోలీ పండగ ఉంది, మార్చ్ 22న ఉగాది పండగ ఉంది. ఈ రెండు డేట్స్ లో ఒక డేట్ కి పుష్ప ది రూల్ అప్డేట్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈసారి సుకుమార్ అండ్ టీం కలిసి పాన్ ఇండియా రేంజులో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.