అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. తన దగ్గర పనిచేసేవారిని కూడా తన కుటుంబ సభ్యులుగానే చూస్తాడు. ఇక అతడి సింప్లిసిటీ గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అభిమానుల మధ్య తిరగడానికి, రోడ్డు పక్కన ఆగి టిఫిన్ చేయడానికి బన్నీ ఎప్పుడు వెనుకాడడు. ఇక ఏ స్టార్ హీరో అయినా తన వద్ద పనిచేసిన వారి పెళ్లికి వెళ్లాలంటే ఆలోచిస్తారు. కానీ బన్నీ మాత్రం తన వద్ద పెంచేసేవారి పెళ్లికి అటెండ్ అయ్యి వారిని ఆశీర్వదించి వస్తాడు.
ఇప్పటికే చాలామంది పెళ్లిళ్లకు అలా సడెన్ గా వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ తాజాగా మరో పెళ్లికి వెళ్లి వారికి షాక్ ఇచ్చాడు. తాజాగా ఇటీవలే బన్ని మేనజర్ మనోజ్ వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లికి ముఖ్య అతిధిగా బన్నీ హాజరయ్యి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మనోజ్ పెళ్ళికి అటెండ్ అయ్యి నవదంపతులు ఆశీర్వదించాడు. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు బన్నీ ఎంతటి గొప్ప వ్యక్తి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బన్నీ పుష్ప 2 లో నటిస్తున్నాడు.