Allu Arjun: అబ్బ.. ఏమున్నాడు.. ‘పుష్ప’ రాజ్ న్యూ లుక్ అదుర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో బన్నీ ఫ్యాషన్ కు ఫిదా కానీ అభిమాని ఉండడు. సినిమా సినిమాకు తన లుక్ ను మార్చేస్తూ ఉంటాడు. అందుకే బన్నీని అందరు స్టైలిష్ స్టార్ అంటారు. ఇప్పటివరకు ఒకే లుక్ తో బన్నీ రెండో సినిమా చేసింది లేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. పుష్ప లో గుబురు గడ్డం, జుట్టు తో కనిపించి మెప్పించిన బన్నీ పుష్ప 2 కోసం మరో కొత్త లుక్ లో కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే బన్నీ న్యూ లుక్ కిర్రాక్ పుట్టిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేశాడు.
ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా అల్లు అర్జున్ లుక్ మాత్రం అద్భుతంగా ఉంది. చెదిరిన జుట్టు, బ్లాక్ టీ షర్ట్, తీక్షణమైన చూపుతో స్టైల్ కే బాప్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ లుక్ పుష్ప 2 కోసం మెయింటైన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఫోటోపై బన్నీ అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ .. అబ్బ.. ఏమున్నాడు అంటూ మెస్మరైజ్ అవుతుండగా .. బన్నీ డై హార్ట్ ఫ్యాన్స్ ఈ ఫోటోను డీపీ లుగా పెట్టేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్న విషయం విదితమే.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. మరి పుష్ప తో ప్రపంచాన్ని మొత్తం ఒక ఊపు ఊపిన బన్నీ పుష్ప 2 తో ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!