Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. గత నాలుగైదు సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే అయ్యాయి. అల వైకుంఠపురంలో, పుష్ప-1, పుష్ప-2 తో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే బన్నీ కెరీర్ లో చాలా మంది స్టార్ డైరెక్టర్లను కూడా వదులుకున్నాడు. వాళ్ల కెరీర్ స్టార్టింగ్ లో బన్నీ వద్దకు కథలను తీసుకుని వెళ్తే ఆయన సినిమాలను అనౌన్స్ చేసిన తర్వాత ఇద్దరు బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను వదులుకున్నాడు. వారెవరో కాదు సందీప్ రెడ్డి వంగా, కొరటాల శివ. 2021లో బన్నీ, కొరటాల కాంబోలో మూవీని అనౌన్స్ చేశారు.
Read Also : Samantha : అలా చేసే దమ్ముందా.. చెత్త కామెంట్స్ చేయకండి
యువసుధ సంస్థ ఈ మూవీని అనౌన్స్ చేస్తూ ట్వీట్ కూడా చేసింది. అప్పటికి కొరటాల శివ మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి వరుస బ్లాక్ బస్టర్లతో జోష్ మీదున్నాడు. బన్నీ, శివ కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అనుకోని కారణాలతో ఆగిపోయింది. బన్నీ, శివ సముద్రం అలల వద్ద దిగిన ఫొటోను కూడా వదిలారు. అదే కథతో ఎన్టీఆర్-కొరటాల కాంబోలో దేవర మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఒకవేళ ఆ మూవీ బన్నీ చేసి ఉంటే బాగుండేదేమో. 2023 సమయంలో సందీప్ రెడ్డి వంగా-అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీ అనౌన్స్ చేశారు.
దానికి భద్రకాళి అనే పేరు కూడా పెట్టాలనుకున్నారు. సినిమాను 2025లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత సందీప్ రణ్ బీర్ తో యానిమల్ తీసి అందరినీ షాక్ కు గురి చేశాడు. ఇండియన్ బాక్సాఫీస్ ను ఆ సినిమా ఊపేసింది. అప్పుడు బన్నీ గురించి చాలా చర్చ జరిగింది. ఆ సినిమా బన్నీ చేసి ఉంటే కథ వేరేలా ఉండేదేమో అనుకున్నారు అంతా. అప్పటి నుంచి ఈ ఇద్దరు డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి వెళ్లిపోయారు. ఆ ఇద్దరితో బన్నీ సినిమా చేయాలని అనుకుంటున్నా అది కుదరట్లేదు. ఈ ఇద్దరూ బన్నీకి దూరంగానే ఉంటున్నారని టాక్. మొన్న కొరటాల మాట్లాడుతూ బన్నీతో మూవీ ఉంటుందని ఓ కామెంట్ చేశాడు. కానీ చూస్తుంటే అది కష్టమే అని తెలుస్తోంది.
Read Also : RGV : అంతా ప్రభాస్ కోసం వెళ్తున్నారు.. నేను విష్ణు కోసం వెళ్తా..