పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్ 2 లో నటిస్తున్నాడు. పుష్ప సినిమాతో బన్నీకి అన్నిచోట్ల కన్నా బాలీవుడ్ లో బాగా పేరు వచ్చిందన్న విషయం తెల్సిందే. ఇక దీంతో బన్నీ.. బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం అల్లు అర్జున్ ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీని మీట్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి మరి సంజయ్ ని కలిశాడు బన్నీ.
ఇక బాలీవుడ్ టాప్ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. పీరియాడిక్ డ్రామాలకు పెట్టింది పేరు ఆయన.. ఇటీవలే గంగూభాయి కతీయవాడి చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ తో ఒక్క సినిమా అయినా చేయాలని బాలీవుడ్ హీరోల చిరకాల కోరిక అంటే అతిశయోక్తి కాదు. అలాంటి డైరెక్టర్ తో బన్నీ కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దక్షిణాది యోధుని ఆధారంగా ఒక పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారని.. ఇందులో అల్లు అర్జున్ హీరోగా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ రేంజ్ ఒక రేంజ్ కి వెళ్లిపోతుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మరి త్వరలో ఈ కాంబినేషన్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
