ఏ ముహూర్తాన రాజమౌళి, ప్రభాస్ బాహుబలి సినిమాను రెండు భాగాలుగా చేశారో గానీ… మేకర్స్ అంతా ఇప్పుడు సీక్వెల్స్ మాయలో పడిపోయారు. బాహుబలి తర్వాత వచ్చిన కెజియఫ్ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పెద్ద సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప-2 సెట్స్ పై ఉంది. ప్రభాస్ సలార్ రెండు భాగాలుగా వస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్ దేవర కూడా చేరింది. ఇదే జాబితాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ, హరిహర వీరమల్లు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటే తెలుగులో రెండు భాగాలుగా వచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి. డీజే టిల్లు, గూఢచారి, ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్స్ సెట్స్ పై ఉండగా.. అఖండ, స్కంద లాంటి సినిమాలకు ఇప్పటికే సీక్వెల్స్ అనౌన్స్ చేశారు.
ఇక ఇప్పుడు బన్నీ మరో సీక్వెల్ చేయడానికి రెడీ అవుతునట్టు తెలుస్తోంది. పుష్ప2 తర్వాత సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్‌తో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు అల్లు అర్జున్. ముందుగా త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చాడు. ఇప్పుడు నడుస్తున్న సీక్వెల్స్ ట్రెండ్‌లో తమ నుంచి కూడా ఏమన్నా సీక్వెల్ ఉంటుందా? అని అడగ్గా… బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో సీక్వెల్ ఉండొచ్చు అని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి.. ఖచ్చితంగా ఈ సినిమా టూ పార్ట్స్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే… త్రివిక్రమ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి.. ఈ క్రేజీ కాంబో రెండు భాగాలుగా సినిమా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.