Allu Arjun: ది పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్.. ది పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: సాధారణంగా పెళ్ళికి ముందు ఎంత ప్లే బాయ్ గా ఉన్నా కూడా పెళ్లి తరువాత పర్ఫెక్ట్ మ్యాన్ గా మారిపోతారు. అది పెళ్లి గొప్పతనం. అల్లు అర్జున్.. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా కూడా పెళ్లి తరువాత ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. ముఖ్యంగా పిల్లలతో బన్నీ గడిపే విధానం ఎంతో ముచ్చటగా ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అర్హచేసే అల్లరికి బన్నీ తెగ మురిసి పోతుంటాడు. ఆమెతో పాటు తాను కూడా చిన్న పిల్లాడిలా మారిపోతుంటాడు. ఇక స్నేహ ఆ మూమెంట్స్ ను కెమెరాలో బంధించి.. అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మొన్నటికి మొన్న దీపావళీ వేడుకల్లో ఈ చిన్నారులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. క్రాకర్స్ కలుస్తూ.. బన్నీ చెయ్యి పట్టుకొని లాగెళ్ళిపోయింది అర్హ. ఆ వీడియో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది.
Annapurna: కీర్తి ఆత్మహత్య చేసుకుంది.. స్టేజిమీద ఏడ్చిన అన్నపూర్ణ
Also Read
ఇక నేడు చిల్డ్రన్స్ డే కావడంతో బన్నీ భార్య స్నేహ.. పిల్లలకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేసింది. వరుణ్ తేజ్ – లావణ్య పెళ్ళిలో దిగిన ఒక ఫోటోను అభిమానులతో పంచుకుంది. అందులో బ్లాక్ సూట్ వేసుకొని బన్నీ.. కొడుకు అయాన్ ను ముద్దాడుతుండగా.. వైట్ డిజైనర్ చీరలో స్నేహ.. ఆమె ఒడిలో అల్లరి పిడుగు అర్హ ఒదిగిపోయి కనిపించింది. ఇక ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన అభిమానులు ది పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్.. ది పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బన్నీ.. పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో బన్నీ ఎలాంటి రికార్డ్ సృష్టిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!