Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్

Raaka

Raaka

రాకాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఇంతకు ముందు చూపించని రేంజ్‌లో క్యారెక్టర్స్ డిజైన్ చేసాడు అట్లీ. సైన్స్‌ ఫిక్షన్‌లో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడట బన్నీ. పాన్ వరల్డ్, హాలీవుడ్ స్థాయిలో మూవీ ఉండబోతోందని టాక్. అయితే ఓ ఇంట్రస్టింగ్ బజ్ కోలీవుడ్‌లో సర్క్యులేట్ అవుతోంది. రాకాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారట మేకర్స్. లెంత్ పెరగడంతో ఒకే పార్ట్‌లో స్టోరీ మొత్తం చెప్పడం కుదరన్న ఉద్దేశంతో టూ పార్ట్స్‌గా సినిమాను తీసుకొస్తున్నామని అనౌన్స్‌ చేసాడు అట్లీ.

రాకా పార్ట్ వన్ 2027లో రిలీజ్ చేయాలని సన్ పిక్చర్స్ భావిస్తున్నట్లు టాక్. పార్ట్ 2ను 2028లో విడుదల చేయనున్నారట. కానీ అఫీషియల్ డేట్ మాత్రం కన్‌ఫామ్‌ చేయలేదు మేకర్స్‌. రీసెంట్‌గా ఇదే విషయాన్ని దర్శకుడు అట్లీని కూడా అడిగింది కోలీవుడ్ మీడియా. మా నిర్మాతలే నన్ను ఈ ప్రశ్న అడగలేదంటూ కవర్ చేసుకున్న అట్లీ.. త్వరలో దీని గురించి అనౌన్స్‌ చేస్తామన్నాడు. అలాగే ఈ సినిమాను ఆస్కార్ లెవల్లో తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నానని తెలిపాడు దర్శకుడు. బన్నీకి సీక్వెల్ కొత్తేమీ కాదు.. పుష్పతో ఆ ప్రయోగం కంప్లీట్ చేసేశాడు. పార్ట్ 3 కూడా ఉంది. ఎప్పుడు పట్టాలెక్కుతోందో ప్రజెంట్ సస్పెన్సే. ఇక రాకా కోసం సన్ పిక్చర్స్ భారీగా ఖర్చు చేస్తోంది. సుమారు రూ. 800 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని సమాచారం. ఇందులో సుమారు రూ. 175 కోట్లు అల్లు అర్జున్, వంద కోట్లు అట్లీ రెమ్యునరేషన్‌గా పుచ్చుకుంటున్నారన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. దీపికా పదుకొణే హీరోయిన్‌గా ఫిక్స్ కాగా, మరో నలుగురు భామలు బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని టాక్.