Allu Aravind Comments at Thandel Movie Opening: ఈరోజు నాగచైతన్య తండేల్ మూవీ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ ప్రయత్నం ఏడాదిన్నరగా మొదలుపెట్టాం, ఇలా ఈ రోజు సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. మా హీరో, దర్శకుడు ఎప్పుడు షూటింగ్ అనే కంగారు లేకుండా, ఈ కథని మనం అనుకున్న స్థాయిలో అద్భుతంగా చూపించాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఈ కథని ఒక వరల్డ్ లోకి తీసుకెళ్లి చూపించాలి, అందుకే ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఇక ఒక సినిమా హిట్ అయితే దర్శకుడికి చాలా అవకాశాలు వస్తాయి కానీ ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇచ్చిన కమిట్మెంట్ కోసం గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాలని నిర్ణయించుకొని ఈ కథకు నాగచైతన్య సరిపోతారని ఆయన్ని దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన ఎక్సయిట్ అయ్యారని అన్నారు. ఆయన ఎవరినీ ఉద్దేశించి ఈ మాటలు అనుకున్నా గతంలో పరశురామ్ వివాదం తెర మీదకు తెచ్చి ఆ దర్శకుడికే ఇది కౌంటర్ అంటున్నారు నెటిజన్ లు.
Thandel: నాగ చైతన్య ‘తండేల్’ మొదలెట్టేశారు!
ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ నాగచైతన్యకు సరైన జోడిగా మా బంగారు తల్లి సాయిపల్లవి వచ్చిందని ఈ మధ్య సినిమాని పెద్దగా చూడటం అలవాటైయింది. అలాగే పెద్దగా తీయాలి, పెద్దగా రిలీజ్ చేయాలి. ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైనప్పుడు పాన్ ఇండియా సౌండ్ అలవాటు చేసిన దేవిశ్రీ ప్రసాద్ రావడం, ఆలాగే అద్భుతమైన కెమరామ్యాన్ షామ్‌దత్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇలా అద్భుతమైన టీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కథని భాను రియాజ్ కార్తీక్ మా వద్దకు తీసుకొచ్చారు, నిజంగా జరిగిన కథ ఇది. ఇలాంటి కథ గీతా ఆర్ట్స్ లో తీస్తే బాగుంటుంది అని వాసు దగ్గరకి తీసుకొచ్చారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో టీం అంతా కూర్చుని ప్రతి విషయాన్ని చర్చించుకొనేటపుడు చాలా సంతోషంగా అనిపించింది, సినిమాని ఇలా తీయాలి కదా అనే తృప్తి వచ్చిందని అన్నారు.