Alia Bhatt : డేర్ చేస్తున్న అలియా భట్.. తేడా వస్తే అంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది ఆలియా. స్టార్ కిడ్, నెపో కిడ్స్ అన్న విమర్శల నుండి నేడు ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. తనదైన నటనతో నటిగా తనని తాను నిరూపించుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆలియా కెరీర్‌లో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు స్పెషల్ ఫేజ్ ఉంది. చెప్పాలంటే అలాంటి చిత్రాలే ఆమెను నటిగా ఓ స్టెప్ పైకి ఎక్కించాయి. హైవే, రాజీ, గంగుభాయ్ కతియావాడీ, డార్లింగ్స్ ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. పెళ్లి అయినా, పాప పుట్టినా కూడా కెరీర్‌ను బ్రహ్మండంగా మార్చుకోవచ్చునని ఫ్రూవ్ చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ.
ఇప్పుడు కేన్స్ ఉత్సవాల్లో మెరవనుంది అలియా భట్. ఫస్ట్ టైం రెడ్ కార్పెట్ పై తొలి అడుగులు వేయబోతుంది ఆలియా. మే 13 నుండి 24 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన జిగ్రా అంతగా ఆకట్టుకోకపోయినా అక్కడితో ఆగిపోలేదు ఆలియా. మరోసారి లేడీ ఓరియెంట్ చిత్రంతో రాబోతుంది. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో ఫస్ట్ టైం తెరకెక్కబోతున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఆల్ఫాలో నటిస్తోంది. ముంజా బ్యూటీ శర్వారీ మరో హీరోయిన్. స్పై ఫిల్మ్‌గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదే కాకుండా భర్తతో కలిసి లవ్ అండ్ వార్‌లో నటిస్తోంది. అలాగే ఆల్ఫా తో డేర్ చేసి ఎక్స్పీరిమెంట్ చేస్తోన్న అలియా, గత చిత్రాలైన రాజీ, గంగుభాయ్ కతియావాడీలా రెండొందల కోట్ల క్లబ్‌లోకి చేర్చుతుందో జిగ్రాలా ఫట్ మంటుందో చూడాలి.
Also Read
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
తాజావార్తలు
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!