హైదరాబాద్ లో తాజాగా జరిగిన బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో “బాగున్నారా… ” అంటూ మొదలెట్టిన అలియా “రాజమౌళి సర్ నన్ను ఈరోజు చాలా కన్ఫ్యూజ్ చేశారు… ఇలాంటి బట్టలు వేసుకున్నందుకు నేను ఎవరో తెలీదు అన్నారు. బ్రహ్మాస్త్ర నాకెంతో స్పెషల్ ఫిలిం. ఈ సినిమా మా అందరి ఏడేళ్ల కష్టం. అయాన్ ఈ సినిమా కోసం ఏడేళ్లు కష్టపడితే.. మేము నాలుగేళ్లుగా షూటింగ్ లో పాల్గొంటున్నాము. కరణ్ చెప్పినట్టుగానే ఇది మాకు ఎమోషనల్ మూమెంట్. ఈరోజు మేము హైదరాబాద్ లో సినిమా పోస్టర్ ను విడుదల చేయడానికి వచ్చాము. 2022 సెప్టెంబర్ 9న విడుదలకు రెడీ అవుతోంది సినిమా.
Read also : వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై రాజమౌళి కామెంట్స్
ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. సినిమాకు భాష అడ్డం కాదన్న విషయం తెలిసిందే. గత రెండ్రోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు అందరి నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికెళ్లినా సినిమాపై ఫ్యాషన్, సపోర్ట్, అమేజింగ్ ఎనర్జి చూస్తుంటే ఏదో డ్రీంలో ఉన్నట్టుగా అన్పిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ కోసం రాజమౌళి, చరణ్, తారక్, నేను కోరుకుంటున్న లవ్, ఎమోషన్ ప్రేక్షకుల నుంచి రావడం అమేజింగ్ గా ఉంది. ఈ సినిమా వెరీ స్పెషల్… ఈ సినిమా బాగుటుంది, పెద్దది, చిన్నది వంటి పదాలు వాడను. కానీ ఈ సినిమా మీ అందరి మనస్సులో స్థానం సంపాదించుకుంటుంది అని మాత్రం నమ్మకంగా చెప్పగలను.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి గారు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన స్టేజ్ పై ఎలా నిలబడుతున్నాము ? ఎలా చూస్తున్నాము ? ఎలా మాట్లాడుతున్నాము ? ఇలా అన్ని విషయాలను గమనిస్తారు. ఇక ఆయన ఇక్కడికి రావడం, ఆయన సమయాన్ని కేటాయించడం అనేది మాకు చాలా విలువైన విషయం. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇది ‘ఆర్ఆర్ఆర్’ డే అంటూ అయాన్ అసలు పనే చేయలేదు. ఆయన మీకు పెద్ద ఫ్యాన్…” అంటూ రాజమౌళి అక్కడికి రావడంపై థాంక్స్ చెప్పింది. ఇక నాగార్జున గారు మా నాన్నతో పని చేశారు. ఇప్పుడు నేను, ఆయన కలిసి పని చేశాము. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. చిత్రబృందం మొత్తం సెట్స్ లో ఆయన గురించే ఎక్కువగా వెయిట్ చేసేవారు అంటూ నాగ్ పై ప్రశంసలు కురిపించారు.