Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భారీ చారిత్రక నేపథ్యాలు, కళ్లు చెదిరే సెట్టింగులు, సాంప్రదాయ కట్టుబొట్టు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా రూటు మార్చేశారు. తన మార్క్ పీరియాడికల్ డ్రామాలను పక్కనబెట్టి, ఏకంగా ఓ భారీ ఆధునిక ప్రపంచాన్ని సృష్టించే పనిలో పడ్డారు. అదే ‘లవ్ & వార్’ (Love & War). ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అలియా భట్ లుక్ ఇప్పుడు నెట్టింట అగ్గి రాజేస్తోంది. ఈ అప్ కమింగ్ మూవీలో రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ లాంటి క్రేజీ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ వదిలిన రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. తాజాగా అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మునుపెన్నడూ చూడని రేంజ్ లో అలియా ఇందులో తన గ్లామర్ తో విధ్వంసం సృష్టిస్తోంది.
ఓ కుర్చీలో ఎంతో స్టైలిష్ గా, బాస్ లేడీలా కూర్చున్న అలియా.. స్లిట్ స్కర్ట్, తలపై ఓ స్పెషల్ హెడ్ పీస్ ధరించి ఇచ్చిన పోజు కుర్రకారుకు మతిపోగొడుతోంది. ఆమె లుక్, స్టైలింగ్, కళ్లల్లో కనిపిస్తున్న తీక్షణమైన హావభావాలు ఒక సరికొత్త ‘మోడ్రన్-రెట్రో’ ఫీల్ ను పంచుతున్నాయి. ఎప్పుడూ కాస్త క్యూట్ గా లేదా డీసెంట్ రోల్స్ లో మెప్పించే అలియా.. ఈ చిత్రంలో మాత్రం పూర్తిగా ఒక కొత్త అవతార్ లో విశ్వరూపం చూపించబోతోందని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. భన్సాలీ సినిమాల్లో హీరోయిన్ల ప్రజెంటేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో అలియాను ఆయన చూపించబోయే విధానం అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీని 2027 జనవరి 21న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
Also Read
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
- The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!