త్వరలోనే టాలీవుడ్ సినిమా షూటింగ్స్ సందడి మొదలుకానుంది. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వేవ్ తో ఆగిపోయాయి. అయితే సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కూడా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా ఈ షెడ్యూల్ లో రెండు వారాలపాటు షూటింగ్ లో పాల్గొననుందని బాలీవుడ్ సమాచారం. ఇదివరకే అలియా షూటింగ్ లో పాల్గొనగా, ఇది చివరి షెడ్యూల్ కానుందని సమాచారం. ప్రస్తుతం ఆమె సంజయ్‌లీలా భన్సాలీ రూపొందిస్తున్న ‘గంగూబాయి కథియవాడి’ షూటింగ్ పూర్తిచేసే పనిలో పడింది. ఈ నెల చివరిలో ఈ సినిమా కంప్లీట్ చేసి.. ఆతర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కోసం హైదరాబాద్ ప్రయాణం కానుందని తెలుస్తోంది.