సమంత విడుదల చేసిన ఆలీ సినిమా పాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో చక్కని విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో ఈ చిత్రాన్ని మోహన్ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీపురం కిరణ్ దర్శకుడు. ఎ. ఆర్.రహమాన్ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేశ్ పళిదం ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా మారారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు విడుదలై చక్కని ఆదరణ పొందాయి. ఈ చిత్రంలోని పతాక సన్నివేశంలో వచ్చే మూడో పాటను గ్లామరస్ క్వీస్ సమంతా అక్కినేని విడుదల చేసి ఆలీకి, సినిమా టీమ్‌కి తన అభినందనలు తెలియచేశారు.
ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ ” ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ సినిమాలోని మూడో పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా ఫేవరేట్ ఆలీగారు ప్రొడ్యూస్ చేస్తున్న మొదటి చిత్రమిది. నాకు ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీలంటే చాలా ఇష్టం. ఇలాంటి సోల్ ఉన్న కథలను నేను చూస్తుంటాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు. తమ చిత్రంలోని మూడో పాటను విడుదల చేసిన సమంతకు ఈ సందర్భంగా ఆలీ కృతజ్ఞతలు తెలిపారు. సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రం పెద్ద విజయం సాధించాలనే ఆకాంక్షను ఆలీ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ సరదా సంభాషణ కూడా జరిగింది. ‘మీ బ్యానర్ పేరేంటి?’ అని సమంత అడిగిన ప్రశ్నకు ”ఆ వుడ్, ఈ వుడ్ ఎందుకు అని ఆలీవుడ్ అనే పేరు నా బ్యానర్ కు పెట్టాను” అని ఆలీ సరదాగా బదులిచ్చారు.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!