Alec Baldwin: రెండేళ్ళ క్రితం హాలీవుడ్ లో జరిగిన ఓ సంఘటన యావత్ చలనచిత్రసీమ ఉలిక్కిపడేలా చేసింది. 2021 ఫిబ్రవరిలో ‘రస్ట్’ షూటింగ్ లో నటుడు, ఆ చిత్ర సహ నిర్మాత అయిన అలెక్ బాల్డ్విన్ సన్నివేశానికి అనుగుణంగా రివాల్వర్ పట్టుకొని కాల్చాలి. అయితే అందులో ఆర్ట్ డిపార్ట్ మెంట్ ఒరిజినల్ బుల్లెట్స్ లోడ్ చేసింది. ఆ విషయం తెలియని బాల్డ్విన్ కాల్చినట్టు యాక్ట్ చేస్తూ సినిమాటోగ్రాఫర్ హలైనా హచన్స్ కు గురిపెట్టి కాల్చారు. అందులోని అసలైన బుల్లెట్స్ హలైనా ప్రాణం తీశాయి. ఆ చిత్ర దర్శకుడు జోయెల్ సౌజాకు కూడా బుల్లెట్ తగిలి, గాయాల పాలయ్యారు. దాంతో అలెక్ పై కేసు నమోదయింది. అరెస్ట్ చేశారు, ఊచలూ లెక్కపెట్టారాయన. బెయిల్ మీద విడుదలైన అలెక్ తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి నానా పాట్లు పడ్డారు. అలెక్ పై సినిమాటోగ్రాఫర్ హలైనా భర్త హచన్స్ కేసు వేశారు. అందులో పదేళ్ళ తన కొడుకు ఆండ్రస్ హచన్స్ తల్లిలేని వాడయ్యాడనీ పేర్కొన్నారు. ఇదే అంశంపై ఐదు పబ్లిక్ కేసులు కూడా నమోదయ్యాయి.
Sylvester Stallone: కామెడీ చేయనున్న సిల్వెస్టర్ స్టాలోన్!
అలెక్ బాల్డ్విన్ తనకు తెలియకుండా చేసిన నేరాన్ని క్షమించమని, ఏదేమైనా హలైనా లేని లోటు తీర్చలేనిదని అందుకు నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధమని అన్నారు. అలాగే హలైనా భర్త మేథ్యూ హచన్స్ కూడా తన కొడుకు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అంగీకరించారు. దాంతో సెటిల్ మెంట్ చేసుకోవడానికి ఇరువర్గాలు అంగీకరించాయి. ఆ సెటిల్ మెంట్ డాక్యుమెంట్స్ ను, అప్రూవ్ చేసిన పత్రాలను సీల్డ్ చేయవలసిందిగా కోర్టు ఆదేశించింది. ఒప్పందం ప్రకారం హయనా భర్త మేథ్యూ హచన్స్ ‘రస్ట్’ చిత్రానికి మరో నిర్మాతగా వ్యవహరిస్తారు. దీంతో ‘రస్ట్’ షూటింగ్ కు మార్గం సుగగమైంది. అలెక్ బాల్డ్విన్ ఊపిరి పీల్చుకున్నారు.