అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో స్క్రిప్ట్ & డైరెక్షన్ కోర్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి, పూరి జగన్నాధ్ వద్ద రచన విభాగంలో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘అలాంటి సిత్రాలు’. దీన్ని జర్నలిస్ట్ , శాటిలైట్ & డిజిటల్ కన్సల్టెంట్ కె . రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రాహుల్ రెడ్డి నిర్మించారు. విభిన్న జీవితాలను గడిపే నలుగురు భిన్న వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడినప్పుడు వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు సుప్రీత్ తెలిపాడు. ఈ సినిమాను ఈ నెల 24న జీ 5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సరికొత్త పాత్రలు, సరికొత్త కథనంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా తప్పకుండా వ్యూవర్స్ ను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.
శ్వేతా పరాశర్ , యాష్ పురి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం : సంతు ఓంకార్ , కెమెరా: కార్తీక్ సాయి కుమార్ , ఎడిటింగ్& సౌండ్ డిజైన్ : అశ్వత్ శివకుమార్.