బిగ్ బాస్ సీజన్ 5 రెండోవారంలో ఉంది. అయితే తాజాగా బిగ్ బాస్ 5 లాంఛింగ్ ఎపిసోడ్ టిఆర్ పి రేటింగ్స్ వచ్చాయి. 15.7 రేటింగ్ సాధించింది బిగ్ బాస్ 5 ఆరంభ ఎపిసోడ్. నిజానికి గత ఏడాది సీజన్ 4 ప్రారంభ ఎపిసోడ్ 18.5, సీజన్ 3 తొలి రోజు 17.9 రేటింగ్ సాధించింది. వాటితో పోలిస్తే తక్కువ రేటింగ్ సాధించినప్పటికీ తన పోటీదారుల కంటే ఎంతో ఎత్తున ఉన్నాడు బిగ్ బాస్. ఈ రేటింగ్ దరిదాపుల్లో మరే షో కనబడలేదు. ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ కూడా 11.4 రేటింగ్ మాత్రమే సాధించింది. అదీ రామ్ చరణ్ కూడా ఉండటం వల్ల. అందుకే నాగ్ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేశారు.
‘థ్యాంక్యూ ఆల్ ఫర్ 5 మచ్ లవ్’. మీరు బిగ్ బాస్ 5 లాంచ్ ని నెంబర్ వన్ చేసి స్టార్ మాని ఓడించలేనిదిగా చేశారు. బిగ్గెస్ట్ వావ్’ అంటూ ట్వీట్ చేశారు నాగ్. అయితే బిగ్ బాస్ హౌస్ లోని పోటీదారులు అంతగా పేరు లేని వారైనా గేమ్ ఛేంజింగ్ స్ట్రాటజీతో ఎలా పుంజుకునేలా చేస్తారన్నది చూడాల్సి ఉంది. వచ్చే ఆదివారం నుంచి ఐపిఎల్ కూడా ఆరంభం కానుంది. ఆ పోటీని బిగ్ బాస్ ఎలా తట్టుకుని నిలబడతాడో చూద్దాం.