2022లో బాగా డిజప్పాయింట్ చేసిన హీరోల్లో నాగ చైతన్య ఒకడు. బంగార్రాజు సినిమాతో 2022ని సక్సస్ తో స్టార్ట్ చేసిన నాగ చైతన్య, ఆ తర్వాత రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కానీ అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో చైతన్య రెండు ఫ్లాప్స్ తో 2022ని ముగించాడు. 2023లో హిట్ కొట్టడంతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవాలని ప్లాన్ చేసిన నాగచైతన్య, తమిళ దర్శకుడు ‘విక్రమ్ ప్రభు’తో కలిశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘కస్టడీ’ సినిమా తెరకెక్కుతోంది. మల్టీ లాంగ్వేజస్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని న్యూ ఇయర్ సంధర్భంగా మేకర్స్ రిలీజ్ చేసారు. కేవలం 27 సెకండ్లు మాత్రమే ఉన్న గ్లిమ్ప్స్ ‘కస్టడీ’ సినిమాపై అంచనాలని పెంచింది.
Read Also: Yash: మీ ఎదురు చూపుకి న్యాయం చేస్తాను… వెయిట్ చెయ్యండి…
‘కస్టడీ’ గ్లిమ్ప్స్ లో యాక్షన్ మోడ్ లో ఉన్న నాగ చైతన్య కనిపించాడు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ‘కస్టడీ’ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ తో ‘కస్టడీ’ షూటింగ్ పార్ట్ కి గుమ్మడికాయ కొట్టేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ‘యువన్ శంకర్ రాజా’ మ్యూజిక్ అందిస్తున్నాడు. శరత్ కుమార్, అరవింద్ స్వామీ, ప్రియమణి లాంటి ప్రముఖ నటులు కస్టడీ సినిమాకి మల్టీలాంగ్వేజ్ కలర్ తెచ్చారు. కస్టడీ సినిమాని వచ్చే ఏడాది మే 12న ఈ సినిమా రిలీజ్ చేయ్యనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు.
Read Also: Naga Chaitanya: చైతు మరదలు.. బావా.. బావా అంటూ ఎలా ఆట పట్టించిందో చూడండి